
intinti gruhalakshmi 25 june 2022 full episode
Intinti Gruhalakshmi 25 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 జూన్ 2022, శనివారం ఎపిసోడ్ 668 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి మ్యూజిక్ స్కూల్ పెడుతోందని.. దాని కోసం బ్యాంక్ లోన్ అప్లయి చేసిందని నందుకు చెబుతుంది లాస్య. దీంతో తనకు ఎవరు ఇస్తారు లోన్ అంటాడు నందు. దీంతో వస్తుంది.. ఖచ్చితంగా వస్తుంది అంటుంది లాస్య. దీంతో నందు షాక్ అవుతాడు. మరోవైపు తులసి డబ్బులు ఇస్తానని శృతికి కన్ఫమ్ చేయడంతో నీకు కావాల్సిన వస్తువులు కొనుక్కో అని ప్రేమ్ తో చెబుతుంది శృతి. ప్రేమ్.. లిస్ట్ రాస్తాడు. మరోవైపు తులసి.. అకౌంట్ లో పడే డబ్బుల గురించి ఫోన్ గురించే చూస్తూ ఉంటుంది. దీంతో ఇంటి సభ్యులు షాక్ అవుతారు.
intinti gruhalakshmi 25 june 2022 full episode
ఏమైంది ఫోన్ నే అప్పటి నుంచి పట్టుకొని కూర్చొన్నావు అని అడుగుతారు అందరూ. దీంతో బ్యాంకులు తెరవగానే డబ్బులు అకౌంట్ లో పడుతాయి అని చెప్పాడు. ఇంకా డబ్బులు పడలేదు ఏంటి అని అంటుంది. ఇంతలో తులసి ఫోన్ కు ఏదో మెసేజ్ వస్తుంది. దివ్య మెసేజ్ ఏంటో చూడు అంటుంది తులసి. దీంతో నీ అకౌంట్ లో 20 లక్షలు క్రెడిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది అంటుంది దివ్య. దీంతో తులసి చాలా సంతోషిస్తుంది. అంకిత, పరందామయ్య, అనసూయ అందరూ సంతోషిస్తారు. నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు పరందామయ్య. ఈ సంతోష సమయంలో నాకు చలివిడి తినాలని ఉంది అంటాడు పరందామయ్య.
డబ్బులు పడ్డాయి కదా.. ఇక ప్రశాంతంగా ఉండండి అని అంటుంది అంకిత. అర్జెంట్ గా వాడికి రూ.5 లక్షలు ఇస్తే కానీ.. నా మనసు ప్రశాంతంగా ఉండదు అంటుంది తులసి. మరోవైపు శృతి.. తులసి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆటోలో వస్తుంటుంది. మరోవైపు శృతికి ఫోన్ చేస్తుంది తులసి.
శృతి.. నీకోసమే ఎదురు చూస్తున్నాను. లోన్ వచ్చేసింది. మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. త్వరగా వచ్చేస్తే డబ్బులు తీసుకెళ్లిపోవచ్చు అంటుంది తులసి. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఆంటి. మీరు నాకోసం ఎదురు చూస్తున్నా అని చెప్పడం అంటుంది శృతి.
డబ్బు రెడీ అయిన విషయం ప్రేమ్ కు కాల్ చేసి చెప్పనా.. వద్దులే.. డైరెక్ట్ గా ప్రేమ్ చేతుల్లోనే డబ్బు పెడితే బెటర్ అని అనుకుంటుంది శృతి. మరోవైపు తులసి ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటుంది. అందరూ నోరు తీపి చేసుకుంటారు. ఇంతలో తులసి అకౌంట్ కు మళ్లీ ఏదో మెసేజ్ వస్తుంది. ఏంటా అని చూస్తుంది అంకిత.
20 లక్షలు మీ అకౌంట్ లో నుంచి డెబిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది ఆంటి అంటుంది అంకిత. దీంతో తులసి షాక్ అవుతుంది. అప్పుడే అక్కడికి శృతి వస్తుంది. అంకిత చెప్పిన మాట విని షాక్ అవుతుంది. అంటే.. బ్యాంకు వాళ్లు వెనక్కి తీసుకున్నారా అని అడుగుతుంది తులసి.
దీంతో లేదు ఆంటి.. వేరే ఏదో బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ అయ్యాయి అంటుంది అంకిత. దీంతో అలా ఎలా అవుతుంది అని అంటాడు పరందామయ్య. ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు.. అంటుంది. దీంతో వెంటనే బ్యాంక్ మేనేజర్ కు ఫోన్ చేయండి అంటుంది శృతి.
దీంతో వెంటనే బ్యాంక్ మేనేజర్ కు ఫోన్ చేస్తుంది తులసి. మీరు లీవ్ లో ఉన్నట్టున్నారు.. డిస్టర్బ్ చేసినందుకు సారీ అంటుంది. నేను అసలు లీవ్ లో లేను.. అంటాడు. నా పేరు తులసి.. మీ బ్యాంక్ లో లోన్ తీసుకున్నాను.. అంటుంది. దీంతో అవును.. 20 లక్షలు మీ అకౌంట్ లో క్రెడిట్ అయ్యాయి కదా అంటాడు.
మళ్లీ డబ్బులు కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది అంటుంది తులసి. దీంతో అవును.. మీరే చెక్ ఇచ్చారు కదా.. ఆ చెక్ ద్వారా డబ్బులు డ్రా చేసుకున్నారు కదా అంటాడు. దీంతో తులసికి అర్థం కాదు. ఫోన్ కట్ చేశాక.. ఆంటి మీరు ఎవరికైనా చెక్ ఇచ్చారా అని అడుగుతుంది.
దీంతో బ్యాంక్ ఏజెంట్ కు బ్లాంక్ చెక్ ఇచ్చా అని చెబుతుంది తులసి. దీంతో బ్యాంక్ మేనేజర్ లీవ్ లో ఉన్నాడని వాడు చెప్పింది కూడా అబద్ధమే. అంతా ఆ బ్రోకరే చేశాడు అని అంటుంది అంకిత. మీరు సంతకం పెట్టిన డాక్యుమెంట్స్ జీరాక్స్ కాపీలు మీ దగ్గర ఉన్నాయా అని అడుగుతుంది అంకిత.
దీంతో ఇచ్చాడు అంటుంది. అవి ఒకసారి ఇవ్వండి అంటుంది. వాటిని చూస్తుంది అంకిత. వాటిని చూసి షాక్ అవుతుంది. అవి అన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అని అంటుంది. మరోవైపు తన అకౌంట్ లో డబ్బులు పడగానే లాస్య సంతోషిస్తుంది. ఆ రంజిత్ గాడు చాలా తెలివిగా మనల్ని ఇరికించాడు అని అంటాడు పరందామయ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.