intinti gruhalakshmi 28 october 2021 full episode
Intinti Gruhalakshmi 28 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 అక్టోబర్ 2021, గురువారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్, శృతి ఇద్దరూ కలిసి యోగా చేయడం చూసిన అంకిత.. నిద్రపోతున్న అభిని లేపుకొని తీసుకొచ్చి చూపిస్తుంది. చూడు.. నువ్వు ఎప్పుడైనా ఇలా నా ఫిట్ నెస్ గురించి ఆలోచించావా? అని అడుగుతుంది. ప్రేమ్ చూడు.. శృతి ఫిట్ నెస్ కోసం ఎంతగా ఆలోచిస్తున్నాడో అని అంటుంది. దీంతో కొత్తగా పెళ్లయిన వాళ్లు అలాగే ఉంటారు. ఎప్పుడూ నిత్యపెళ్లికొడుకులా ఉండటం నావల్ల కాదు. పెళ్లయిన కొత్తలో నీకు కూడా ఇవన్నీ నేర్పించాను కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో అంకిత చిరాకు పడుతుంది.
intinti gruhalakshmi 28 october 2021 full episode
మరోవైపు జీకే దగ్గరికి వెళ్లి మన అప్పు విషయం చెప్పి ఏదోలా మన సమస్యలను సాల్వ్ చేసుకుందామని లాస్యతో అంటాడు నందు. దీంతో.. అప్పు విషయం నీకెందుకు.. అదంతా తులసి చూసుకుంటుంది కదా అంటుంది లాస్య. ఏంటి తులసి చూసుకునేది. ఆ ప్రాజెక్ట్ పూర్తి కాదు అని నాకు తెలుసు. ఆ ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే.. ఈ ఇల్లును అమ్మేయాలి లేదంటే నేను జైలుకు వెళ్లాలి అంటాడు నందు.
ఇంతలో తులసి వస్తుంది. ఆఫీసుకు వెళ్దాం పదండి అంటుంది తులసి. ఏంటి ఆఫీసుకు వెళ్లేది. ఆఫీసు లేదు.. గీఫీసు లేదు. ఉద్యోగులు రాకుండా మనం వెళ్లి ఏం చేస్తాం అంటాడు నందు. దీంతో ఉద్యోగుల విషయం నేను చూసుకుంటాను. నేను మేనేజర్ తో మాట్లాడాను అని చెబుతుంది తులసి. దీంతో సరే.. నీకు బాగా ఆతృతగా ఉంది కదా.. వెళ్దాం పదా ఆఫీసుకు అని నందు కూడా రెడీ అవుతాడు.
కట్ చేస్తే.. శృతి దేవీ నవరాత్రుల సందర్భంగా పూజ చేస్తూ ఉంటుంది. ఇంతలో అంకిత వచ్చి జరుగు.. నేను పూజ చేస్తా అంటుంది. ఈరోజు నుంచి దేవీకి నేను పూజ చేస్తా అంటుంది అంకిత. అదేంటి అంకిత.. నేను దేవి నవరాత్రుల కోసం మొక్కుకున్నాను కదా.. అంటుంది. అయినా కూడా అంకిత వినదు. దీంతో శృతి అక్కడి నుంచి వెళ్లిపోబోతుంది. పరమానందయ్య ఉండి.. ఆగమ్మ అంకిత పూజ చేయాలని అనుకుంటే.. ముందే అన్నీ పూజ సామాగ్రి తెచ్చిపెట్టుకోవాలి కానీ.. ఇలా శృతి అన్నీ సిద్ధం చేశాక కాదు.. అంటాడు. కానీ.. రెండు పెళ్లిళ్లు చేసుకున్న శృతికి అసలు పూజ చేసే అర్హత లేదని.. పరమానందయ్య భార్య అంటుంది. దీంతో శృతి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
కట్ చేస్తే అంకిత పూజ చేసి.. హారతి తీసుకొస్తుంది. తులసిని హారతి తీసుకోమని చెబుతుంది. దీంతో శృతి ఎక్కడ అని అడుగుతుంది. శృతి లేదు.. నేనే పూజ పూర్తి చేశా అంటుంది. ఆ తర్వాత శృతి లంచ్ బాక్స్ తీసుకొని వస్తుంది. ఆంటి.. ఆఫీసుకు వెళ్తున్నారు కదా.. లంచ్ బాక్స్ తీసుకెళ్లండి.. అని అంటుంది శృతి. దీంతో నందు, లాస్య సీరియస్ అవుతారు. మాకు లంచ్ బాక్స్ వద్దు.. గించ్ బాక్స్ వద్దు అంటారు. దీంతో తులసి బాక్స్ తీసుకొని వెళ్తుంది.
intinti gruhalakshmi 28 october 2021 full episode
నన్ను ఇంట్లో అందరూ అవమానించేలా చేసి.. నువ్వు తీరిగ్గా ఇక్కడ బెండకాయలు కోసుకుంటున్నావా? అని.. కూరగాయలు అన్నింటినీ కిందపడేస్తుంది అంకిత. దీంతో ఎందుకు ఇంత వైల్డ్ గా బిహేవ్ చేస్తున్నావు అంటుంది. నేనేం తప్పు చేశాను.. అంటుంది. తెలియదా.. నువ్వు నీ లోపల ఎంత కుట్ర ఉందో నాకు తెలుసు అంటుంది. నువ్వు ఎవరిని ఏమార్చినా.. నన్ను ఏమార్చలేవు శృతి అంటుంది అంకిత. లేదు.. నేనేం తప్పు చేయలేదు అంటుంది. నువ్వు కావాలంటే చెప్పు.. నీ నమ్మకం సాధించాలంటే ఏం చేయాలో చెప్పు అంటుంది శృతి. దీంతో ఇంట్లో నా పనులన్నీ నువ్వే చేయాలి అంటుంది అంకిత.
ఆ తర్వాత ఆఫీసులో అందరి ముందు తన పరువు తీసిందని నందు ఇంటికి వచ్చాక తులసిపై ఫైర్ అవుతాడు. నేను ఇక ఆఫీసుకు రాను అంటాడు. నువ్వే ఆ ఆఫీసుకు రాజు అయిపోయావు. ఒక నెల జీతాలు కూడా ఇచ్చేశావు. ఇక నాతో ఏం పని. నాకు ఆ ఆఫీసుతో, ప్రాజెక్టుతో ఎటువంటి సంబంధం లేదు.. అని చెప్తాడు నందు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
This website uses cookies.