Home » Entertainment » Intinti Gruhalakshmi 29 November 2021 Episode Highlights
Entertainment

Intinti Gruhalakshmi 29 Nov Episode Highlights : ఆసుపత్రిలో తులసి.. నేను కావాలా? తులసి కావాలా? తేల్చుకో అని నందుకు లాస్య వార్నింగ్

Authored By
Varun G
The Telugu News | Published on: November 28, 2021, 12:30 pm
Advertisement

Intinti Gruhalakshmi 29 Nov Episode Highlights : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఇంటింటి గృహలక్ష్మి 28 నవంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 489 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసికి క్యాన్సర్ వచ్చిందేమో అని అనుమానంగా ఉందని.. అందుకే వెల్ నెస్ సెంటర్ కు తీసుకెళ్తున్నామని అభి.. నందుతో చెబుతాడు. దీంతో నందు షాక్ అవుతాడు. సరే.. నేను కూడా వస్తాను అంటాడు.ఉదయమే అందరూ రెడీ అవుతారు. నందు కూడా వాళ్లతో పాటు వస్తానంటాడు. లాస్య మాత్రం వద్దంటుంది. నువ్వు అసలు.. తులసితో ఏ బంధంతో వెళ్తున్నావంటూ ప్రశ్నిస్తుంది లాస్య. తనతో పాతికేళ్లు కాపురం చేశాను కాబట్టి వెళ్తున్నాను అని చెబుతాడు.

Advertisement

intinti gruhalakshmi 29 november 2021 episode highlights

ఇంతకీ నువ్వు వస్తున్నావా లేదా అని లాస్యను అడుగుతాడు నందు. నేను రాను.. అని కరాఖండిగా చెప్పేస్తుంది లాస్య. దీంతో సరే.. అయితే అని చెప్పి అందరితో పాటు వెల్ నెస్ సెంటర్ కు వెళ్తాడు నందు. దీంతో లాస్యకు పట్టరాని కోపం వస్తుంది.ఇంట్లో తనొక్కతే ఉంటుంది. వెంటనే భాగ్య.. లాస్యకు ఫోన్ చేస్తుంది. ఏమైంది మహారాణి.. ఒంటరిగా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అంటుంది. ఏం చేయను.. తులసికి అనారోగ్యం వచ్చింది అంటుంది. నువ్వు కూడా తులసి మాయలో పడిపోయావు లాస్య అంటుంది భాగ్య.నేను తులసి మాయలో పడిపోవడం ఏంటి.. నేనేమీ అంత పిచ్చిదాన్ని కాదు అంటుంది లాస్య. నిన్ను కూడా తులసికి అనారోగ్యం అని నమ్మించారు కదా. ఇదంతా తులసి కుట్ర. నందును తనవైపునకు తిప్పుకునేందుకు తులసి చేసిన కుట్ర ఇది.. అందులో నువ్వు కూడా పడిపోయావు అంటుంది భాగ్య.

Advertisement

Intinti Gruhalakshmi 29 Nov Episode Highlights : వెల్ నెస్ సెంటర్ లో సంతోషంగా గడిపిన తులసి ఫ్యామిలీ

మరోవైపు నందు ఫ్యామిలీ అంతా వెల్ నెస్ సెంటర్ కు వెళ్తారు. ఆ ప్లేస్ ను చూసి తులసి మైమరిచిపోతుంది. ప్లేస్ బాగుంది. వారం ఏంటి.. ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండొచ్చు అని అంటుంది తులసి. రిసార్ట్ కు వచ్చినట్టు ఉంది.. ఎంత బాగుంది అని అందరూ అంటారు.ఇక్కడ ఎవ్వరూ పోట్లాడుకోకూడదు. అందరూ సంతోషంగా ఉండాలి. అప్పుడే నేను ఇక్కడ ఉంటా అంటుంది తులసి. దీంతో సరే.. అందరం కలిసి సంతోషంగా ఉంటాం. ఆనందంగా ఉంటాం.. అని అంటారు కుటుంబ సభ్యులు. చాలా రోజుల తర్వాత అందరం కలిసి సరదాగా గడుపుతున్నాం అని అంటాడు పరందామయ్య.

సిటీకి దూరంగా పచ్చని ప్రకృతి మధ్య ఉండటం ఎంత ప్రశాంతంగా ఉందో అని అనుకుంటుంది తులసి. మరోవైపు లాస్య కూడా వెల్ నెస్ సెంటర్ కు వస్తుంది. నందును నిలదీస్తుంది. తులసి హాస్పిటల్ లో ఉంది కదా. దానికి కారణం నువ్వు కాదా. ఓవైపు తులసిని బాధపెడుతున్నావు.. మరోవైపు నన్ను బాధపెడుతున్నావు. ఇలా నావల్ల కాదు నందు.. అంటుంది తులసి.నీకు ఎవరు కావాలి. నేనా.. తులసా.. ఎవరితో జీవితం పంచుకోవాలని అనుకుంటున్నావో నిర్ణయించుకో. నాతోనా.. తులసితోనా.. ఏదో ఒకటి తేల్చుకో.. అని చెప్పి నందుకు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది లాస్య. దీంతో నందు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి