Intinti Gruhalakshmi 3 March Today Episode : ఢిల్లీ ఈవెంట్ కు వెళ్లనని చెప్పిన ప్రేమ్.. లాస్యను కొట్టబోయాడని ప్రేమ్ ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన తులసి.. లాస్య ప్లాన్ వర్కవుట్ అయినట్టేనా?

Intinti Gruhalakshmi 3 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 మార్చి 2022, గురువారం ఎపిసోడ్ 570 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అదేంటి ప్రేమ్ ఢిల్లీ ఈవెంట్ నీ లైఫ్ ఈవెంట్ అన్నావు. నీ లైఫ్ ను మార్చుతుంది అన్నావు కదా. మరి చేయను అంటున్నావు ఎందుకు అని శృతి ప్రశ్నిస్తుంది. దీంతో మనిషి అన్నాక చాలా కలలు కంటాడు. అన్నీ జరుగుతాయా.. అంటాడు ప్రేమ్. దీంతో నీకొచ్చిన సమస్య ఏంటి అంటుంది శృతి. దీంతో ఇంట్లో సమస్యలను ఇలా పెట్టుకొని.. అమ్మను ఒంటరిగా వదిలేసి మూడు నెలలు ఢిల్లీకి వెళ్లి ఉండటం అంటే నా వల్ల కాదు. నా తలతిక్కగా ఎలా మాట్లాడారో నువ్వే చూశావు కదా అంటాడు ప్రేమ్. దీంతో నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండటం వల్ల ఆంటికి వచ్చే లాభం ఏం ఉండదు ప్రేమ్. నువ్వు ఆ డబ్బు ఎలాగూ తీసుకురాలేవు. చివరకు ఈవెంట్ ను కూడా వద్దనుకుంటే ఎలా అంటుంది శృతి.

intinti gruhalakshmi 3 march 2022 full episode

మరోవైపు దివ్య వచ్చి అమ్మ నేను వంట పనులన్నీ చేశాను. ఇంకా ఏమున్నాయి చెప్పు మొత్తం చేసేస్తా అంటుంది దివ్య. నువ్వు ఏంటి తాగిన కప్పు కూడా కడగవు.. ఇవాళ ఏంటి మొత్తం కిచెన్ పనులన్నీ చేస్తున్నావు.. కాకా పడుతున్నావా అంటుంది తులసి. ఇంతలో ప్రేమ్ వస్తాడు. ఇద్దరూ కాసేపు గొడవ పడతారు. ఇంతలో అభి, అంకిత ఇద్దరూ వస్తారు. మామ్.. నేను హాస్పిటల్ కు వెళ్లొస్తాను అంటాడు అభి. దీంతో నిజంగా హాస్పిటల్ కే వెళ్తున్నావా.. లేక ఇంకెక్కడికైనా అనే సరికి అందరూ షాక్ అవుతారు. లేదు మామ్.. ఈరోజు నుంచి నేను హాస్పిటల్ కే వెళ్తాను.. ఇంకే పని చేయను అంటాడు అభి. మరోవైపు శృతి.. ప్రేమ్ ఈవెంట్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది.

శృతి ముభావంగా ఉండటం చూసి తులసి.. శృతి దగ్గరికి వెళ్తుంది. ఏమైందమ్మా అలా ఉన్నావు.. ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. దీంతో కొంతమంది పట్టువిడుపు లేకుండా ఎందుకు అంత మొండిగా వ్యవహరిస్తారు ఆంటి అని అడుగుతుంది శృతి.

భార్య చెప్పేది కూడా వినాలి కదా. ప్రతి నిర్ణయంలో భార్య చెప్పేది కూడా వినాలి కదా అంటుంది శృతి. దీంతో భార్యే భర్తకు నచ్చజెప్పుకోవాలి అంటుంది తులసి. ప్రేమ్ అలా మొండితనం చేసే రకం కాదు. ఏం జరిగిందో చెప్పు అంటుంది తులసి.

దీంతో చెప్పను ఆంటి.. మీకు కంప్లయింట్ చేసినట్టు అవుతుంది అంటుంది శృతి. ఢిల్లీ ఈవెంట్ గురించి ప్రేమ్ ఎన్ని కలలు కంటున్నాడో మీకు తెలుసు కదా. ఇప్పుడు వాళ్లు ఈవెంట్ కు రమ్మంటే రానని చెబుతున్నాను. ఇంట్లో పరిస్థితులు బాలేవు.. అమ్మ దగ్గర ఉండాలి అంటున్నాడు అని చెబుతుంది శృతి.

Intinti Gruhalakshmi 3 March Today Episode : ఎందుకు ఢిల్లీ ఈవెంట్ కు వెళ్లడం లేదని ప్రేమ్ ను అడిగిన తులసి

దీంతో దీనికే నువ్వు టెన్షన్ పడుతున్నావా. నేను వాడిని ఒప్పిస్తానులే.. వాడితో నేను మాట్లాడుతానులే అంటుంది తులసి. ఇంతలో ప్రేమ్ ఇంటికి వస్తాడు. ప్రేమ్ ను చూసి నువ్వు చేసే పనులు, నువ్వు తీసుకునే నిర్ణయాలు నన్ను నిద్రపోనివ్వడం లేదు అని అంటుంది తులసి.

డిల్లీ ఈవెంట్ వచ్చిందని.. నువ్వు ఈవెంట్ కు వెళ్లడం లేదని ఎందుకు నాకు చెప్పలేదు అంటుంది. అమ్మ మీద అభిమానం ఉంటే చాలు  కానీ.. భవిష్యత్తును పణంగా పెట్టాల్సిన అవసరం లేదు.. అంటుంది తులసి. ఈ అమ్మ నీకు శాశ్వతం కాదు.. నీ భవిష్యత్తు శాశ్వతం అంటుంది తులసి.

ఈ అమ్మ నీకు అడుగులు నేర్పింది.. తన వెనుక తిరగడానికి కాదు. తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి అంటుంది తులసి. దీంతో నా లక్ష్యం అమ్మ మాత్రమే. అది నువ్వే.. అని అంటాడు ప్రేమ్. దీంతో అక్కడికి వచ్చిన నందు.. తప్పు చేస్తున్నావు ప్రేమ్ అంటాడు.

మీ అమ్మ నీ మంచి కోసం ఆరాటపడుతుంటే.. నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. దొరికిన అవకాశాన్ని వదులుకోకూడదు.. అంటాడు నందు. దీంతో దొరికిన అవకాశాన్ని చేజిక్కించుకొని అందరినీ నట్టేట ముంచేవాళ్లను.. తన దారి తాను చూసుకునే వాళ్లను ఏమంటారో తెలుసా.. నంద గోపాల్ అంటారు అంటాడు ప్రేమ్.

ప్రేమ్.. నందుపై విరుచుకుపడటంతో ప్రేమ్.. నువ్వు లోపలికి వెళ్లు అంటుంది తులసి. ఆ తర్వాత నా పిల్లలందరినీ నాపై ఉసిగొల్పి ఇప్పుడు ఏం తెలియనట్టుగా మాట్లాడుతున్నావా అని తులసిపై నందు సీరియస్ అవుతాడు. నాకు ఇంకేం పని లేదా.. ఇంకా మీరు ఇలాంటి మాటలు మాట్లాడటం మానేయండి.. అని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

మరోవైపు తులసి ఇంట్లో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. శివరాత్రి రోజు ముస్తాబు అయి తులసి చెట్టుకు పూజలు చేస్తుంది తులసి. తల్లి.. నా పెద్ద కొడుకును ఆ గండం నుంచి బయటపడేసి నా ప్రాణాన్ని తిరిగి నిలబెట్టావు. ఈరోజు నుంచి ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండేలా చూడు.. అని కోరుకుంటుంది తులసి.

దీంతో అక్కడే ఉన్న దివ్య.. తులసిని ఆటపట్టించాలని చూస్తుంది. ఇంతలో తులసి చూసి తనను లేపుతుంది. ఆ తర్వాత అందరూ అక్కడికి వస్తారు. అందరూ సరదాగా కాసేపు ఆడుకుంటారు. ఆ తర్వాత ఏదో విషయంలో తులసిపై లాస్య సీరియస్ అవుతుంది.

దీంతో మా అమ్మనే అంటావా అంటూ లాస్యను కొట్టబోతాడు ప్రేమ్. దీంతో నా భార్య మీదనే చేయి వేస్తావా అంటూ ప్రేమ్ ను కొడతాడు నందు. ఆ తర్వాత ప్రేమ్, శృతి ఇద్దరినీ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని చెబుతుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

C ardamom| సుగంధ ద్రవ్యాల రాణి యాలకులు.. ఎన్ని అద్భుత ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో తెలుసా?

C ardamom| పరిమాణంలో చిన్నదైనప్పటికీ, సుగంధంలో మహా శక్తివంతమైన యాలకులు (Cardamom) భారతీయ వంటకాలలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి.…

1 minute ago

Palm Candy Benefits | తాటి బెల్లం ఆరోగ్యానికి మంచిదా…ఆయుర్వేదం చెబుతున్న అద్భుతాలు

Palm Candy Benefits | ప్రాచీన కాలం నుంచీ మన వంటగదిలో ఒక ముఖ్యమైన స్థానం పొందిన తాటి బెల్లం,…

1 hour ago

Brinjal | ఆరోగ్యానికి వరంగా వంకాయ..గుండె, మధుమేహం, క్యాన్సర్ రోగులకి అనేక లాభాలు

Brinjal | వంకాయను సాధారణంగా మనం కూరగాయగా చూస్తాం. కానీ, ఈ సాధారణంగా కనిపించే కూరగాయకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు…

2 hours ago

Vastu Tips | వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు బొప్పాయి చెట్టు మంచిదా, కాదా.. పండితుల సూచన ఏంటి?

Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…

3 hours ago

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

18 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

19 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

19 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

21 hours ago