
Rashmi Gautam Fires on Not Leeting Feed To Strays
Rashmi Gautham : సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, వారిలో చాలా తక్కువ మందికి మాత్రమే విశేషమైన గుర్తింపుతో భారీ స్థాయిలో అభిమానం దక్కుతోంది. అలాంటి వారిలో అందాల యాంకర్ రష్మీ గౌతమ్ ఒకరు. ఆమె తన యాంకరింగ్‌తోనే కాదు సామాజిక సమస్యలపై కూడా స్పందిస్తూ అందరి మన్ననలు పొందుతుంటుంది. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తోంది. చాలా కాలం క్రితమే రష్మీ గౌతమ్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది.ఈ క్రమంలోనే చాలా చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలను పోషించింది.
అలా ఎంతో కాలంగా సినీ రంగంలో కొనసాగుతోంది. ఆ సమయంలో జబర్ధస్త్ ఆఫర్ రావడంతో ఇక యాంకర్‌గా సెటిల్ అయింది.యాంకర్ రష్మీ మూగ జీవాల కోసం ఎంతో కష్టపడుతుంటుంది. మూగ జీవ హింస ఎక్కడ జరిగినా ప్రశ్నిస్తుంది. ఆ ఘటనలపై సమాజాన్ని నిలదీస్తుంది.సంక్రాంతి కోడి పందెలా, బక్రీద్ నాడు చేసే జీవహింస ఇలా ప్రతీ దాన్నిరష్మీ ప్రశ్నిస్తుంటుంది. మరీ ముఖ్యంగా వీధి కుక్కలను గాయపరిచే ఘటనలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటుంది. ఇక నాన్ వెజ్ తినడాన్ని కూడా రష్మీ వ్యతిరేకిస్తుంటుంది. సుఖం కోసం మనం ఆవు పాలను తాగుతున్నాం.. పాల కోసం ఆవులను ఎంతగానో హింసిస్తున్నాం..
rashmi gautham emotional on pet issues
దూడలకు కూడా పాలు సరిపోనివ్వడం లేదు.. మనమే తాగేస్తున్నాం అంటూ యాంకర్ రష్మీ ఆవేదన చెందుతుంటుంది.మూగ జీవాలపై ఇంత ఆవేదన చెందే రష్మీ గౌతమ్ తాజాగా ఉక్రెయిన్ పరిస్థితులని అన్వయిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. యుద్ధ సమయంలో కూడా వారు తమ పెట్స్ ని వెంట పెట్టుకొని తీసుకెళుతున్నారు.అక్కడ వాటికి వారు ఇచ్చే ప్రాధాన్యత అలాంటింది. మన దగ్గర మాత్రం పెట్స్ రెండు కాళ్లకి తాడు కట్టి కారులో నుండి బయట పడేస్తుంటారు. అలాంటి రాక్షసులు ఎలాబ్రతుకుతున్నారో అంటూ రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది.
Mana Shankara Vara Prasad Garu Ccollection : డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్…
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
This website uses cookies.