Intinti Gruhalakshmi 30 Oct Today Episode : నేను ఈ ప్రాజెక్ట్ చేయను.. 2 కోట్లు కట్టను.. అంటూ తులసిపై నందు ఫైర్.. దీంతో తులసి ఏ నిర్ణయం తీసుకుంటుంది?

Intinti Gruhalakshmi 30 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 అక్టోబర్, 2021, శనివారం ఎపిసోడ్ 464 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆఫీసులో లంచ్ టైమ్ కాగానే తులసి శృతి ఇచ్చిన లంచ్ బాక్స్ ఓపెన్ చేసి తింటూ ఉంటుంది. లాస్య మాత్రం పిజ్జా ఆర్డర్ చేస్తుంది. అది దరిద్రంగా ఉంటుంది. దీంతో దాన్ని తినలేకపోతారు వాళ్లు. కానీ.. తులసి మాత్రం ఇంటి ఫుడ్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. లాస్య, నందు మాత్రం పిజ్జాను తినలేక.. ఆకలితో అలమటిస్తుంటారు. ఇంటి భోజనానికి పేర్లు పెడతారా? ఇప్పుడు చెబుతాను మీ సంగతి అని వెంటనే శృతికి ఫోన్ చేస్తుంది తులసి. అమ్మ శృతి వెంటనే మా అత్తగారి దగ్గరికి వెళ్లి దిష్టి తీయించుకో. నువ్వు పంపించిన లంచ్ బాక్స్ లో ఐటెమ్స్ మామూలుగా లేవు అమ్మా.. సూపర్బ్ గా ఉన్నాయి. నేనైతే అన్నీ తిని కడుపు నింపుకున్నాను.. అంటుంది.

intinti gruhalakshmi 30 october 2021 full episode

వాళ్లకు కూడా కొంచెం పెట్టండి ఆంటి అని అంటుంది శృతి. వాళ్లు అడిగితే పెడుతాను కానీ.. వాళ్లు అడగకపోతే ఎలా? అని అంటుంది తులసి. రేపు కూడా వంటలు ఇలాగే ఉండాలి. వేరే లేవల్ లో ఉండాలి సరేనా అని శృతికి చెబుతుంది. సరే అమ్మా.. దిష్టి తీయించుకోవడం మరిచిపోకు ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేసి.. లాస్య పాయసం కావాలా? అంటుంది. అక్కర్లేదు.. నా పిజ్జా నాకు చచ్చింది అని చెప్పి దాన్ని బలవంతంగా తింటుంది లాస్య. రేపు నువ్వే ఏదో ఒకటి వండుకొనిరా అని చెబుతాడు నందు.

ఏమాటకు ఆమాట చెప్పుకోవాలి. మన బాస్ కు అదృష్టం జలగలా పట్టుకుంది అని తోటి ఉద్యోగులతో అంటాడు మేనేజర్. వాళ్ల మాటలు నందు వింటుంటాడు. అదేంటి సార్ అలా అంటారు. కంపెనీ లాస్ లో ఉంది కదా అంటే. అతడి పక్కన ఇద్దరు భార్యలతో కంపెనీ అదిరిపోతుంది కదా అంటాడు. ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలి.. బాస్ కు చేతగాకపోయినా ఓవైపు మాజీ భార్య, మరవైపు లవర్ ఇద్దరూ కలిసి బాస్ కోసం భలేగా పనిచేస్తున్నారు.

మీకు ఇంకో విషయం తెలుసా? మన బాస్ కు ఏదీ చేతగాదు. పెళ్లి చేసుకున్నాడు. మధ్యలోనే వదిలేశాడు. ఆ తర్వాత లాస్యను పెళ్లి చేసుకుంటా అన్నాడు.. తనను చేసుకోలేదు. మరోవైపు ప్రాజెక్టును కూడా సగంలోనే వదిలేశాడు.. అని అనుకుంటారు. దీంతో నందుకు తీవ్రంగా కోపం వస్తుంది. సాయంత్రం ఇంటికి రాగానే.. నందు తీవ్రంగా తులసిపై ఫైర్ అవుతాడు. షట్ అప్ అంటాడు. దీంతో అందరూ అక్కడికి వచ్చేస్తారు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు ప్రవర్తిస్తున్నావా? అంటాడు నందు.

Intinti Gruhalakshmi 30 Oct Today Episode : తులసిపై నందు ఫైర్

ఆఫీసు స్టాఫ్ ముందు తను నాకంటే గొప్ప అని నిరూపించుకునేందుకు అందరి ముందు నన్ను ఎదవను చేసింది. కావాలని పనికట్టుకొని నన్ను ఆఫీసుకు తీసుకెళ్లింది.. అంటాడు నందు. నందు గురించి ఉద్యోగులు అన్న మాటలు చెప్పడానికి నాకు కూడా మాటలు రావడం లేదు అంటుంది లాస్య. పేరుకే మా ఆయన బాస్.. జీతాలు ఇచ్చేది మాత్రం నేనే అంటూ అందరి ముందు ప్రచారం చేసుకుంది. ఒక్క నెల జీతాలు ఇచ్చి ఈ కంపెనీకి రాజు అయిపోవాలని పోజు కొడుతోంది. నాకు ఏ పనీ చేతగాదట.. అని ఉద్యోగులు అన్నారు. వాళ్ల ముందు నన్ను చులకన చేశావు కదా.. అంటాడు నందు.

intinti gruhalakshmi 30 october 2021 full episode

ఆఫీసు విషయంలో ఇక మనకు ఎలాంటి సంబంధం లేదు. ఈరోజు నుంచి నువ్వెవరో.. నేనెవరో.. ఆ కంపెనీతోనూ.. ఆ ప్రాజెక్ట్ తోనూ నాకు ఎలాంటి సంబంధం లేదు.. అని అంటాడు నందు. దయచేసి అలాంటి నిర్ణయం తీసుకోకండి అంటుంది తులసి. ఇక నేను నీ మాట వినను.. పెనాల్టీ కట్టలేకపోతే నేను జైలుకైనా వెళ్తాను కానీ.. ఆఫీసుకు మాత్రం రేపటి నుంచి రాను.. ఇదే నా ఫైనల్ డిసిషన్.. అని చెప్పి నందు వెళ్లిపోతాడు. దీంతో తులసి షాక్ అయిపోతుంది.

మరోవైపు దివ్య.. ఏడుస్తూ ఉండటం చూస్తుంది తులసి. ఏమైంది అని అడుగుతుంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది. అంటే.. ఏం లేదు అమ్మ అంటుంది. కారణం లేకుండా కన్నీళ్లు ఎందుకు వస్తాయి.. ఆ అమ్మకు చెప్పేదేంటి అని అనుకుంటున్నావా? అని అడుగుతుంది. ఫీజు కట్టలేదని మా ఫ్రెండ్స్ అందరి ముందు లెక్చరర్ అవమానించాడు.. అంటుంది దివ్య. అయ్యో.. దానికేనా నువ్వు ఏడ్చేది. ఫీజు కట్టాలని నువ్వు చెప్పావు కానీ.. నేను మర్చిపోయాను.. గుర్తు చేయొచ్చు కదా అంటుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Recent Posts

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

60 minutes ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

4 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

7 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

9 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

12 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

14 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

1 day ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

1 day ago