Intinti Gruhalakshmi 4 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 జనవరి 2022, మంగళవారం ఎపిసోడ్ 520 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి, శృతి ఇద్దరూ మాట్లాడుకుంటుండగా వచ్చిన భాగ్య రెచ్చిపోతుంది. ఇంకా నీకు ఇక్కడ చోటు ఎక్కడుంది తులసి. నీ పని అయిపోయింది. ఇంకా కోడలుగా అధికారం చెలాయించాలనుకుంటే ఇక నడవదు అంటూ ఏదేదో మాట్లాడుతుంది. భాగ్య గురించి తెలిసిందే కదా అని తులసి కూడా ఏం అనదు. నాకు నావాళ్లు ఎప్పుడూ దూరం కాలేదు అని అంటుంది. మరోవైపు నందు, తులసి రూమ్ ను తీసేసుకుంటుంది లాస్య. ఇక నుంచి ఇది నా రూమ్. ఈ రూమ్ ను నాకు నచ్చినట్టుగా మార్చుకుంటాను అని.. రూమ్ లో అన్ని మార్పులు చేస్తుంది. తనకు నచ్చినట్టుగా రూమ్ ను సెట్ చేసుకుంటుంది లాస్య. ఆ తర్వాత బీరువాలో తన బట్టలు సర్దుకుంటుండగా తనకు ఒక బ్యాగ్ కనిపిస్తుంది.
విడాకులు ఇచ్చి ఇన్ని రోజులు అయినా.. ఇంకా తన బ్యాగ్ ఇక్కడెందుకు ఉంది అని అనుకుంటుంది లాస్య. ఆ బ్యాగును చెత్తబుట్టలో పడేస్తుంది. ఇంతలో నందు వస్తాడు. లాస్య.. ఇక్కడ నా లాప్ టాప్ టేబుల్ ఉంది ఏమైంది అని అడుగుతాడు. అడ్డుగా ఉందని బయట పెట్టాను అంటుంది లాస్య. ఇంతకీ రూమ్ ఎలా ఉంది అని అడుగుతుంది లాస్య. ఉండాల్సినవన్నీ ఉండేచోట లేవు అని అంటాడు నందు. ఇంతలో చెత్తబుట్టలో పడేసిన బ్యాగును చూస్తాడు నందు. దాన్ని అందులో నుంచి తీసి… ఇది తులసికి నేను ఇచ్చిన బ్యాగు కదా అని అనుకుంటాడు నందు. లాస్య వైపు చూస్తాడు. పాతికేళ్లుగా తను ఈ రూమ్ లో నాతో పాటు ఉంది. నువ్వు ఎంత కష్టపడి తన వస్తువులు పడేసినా.. తన మెమోరీస్ ఉంటూనే ఉంటాయి అంటాడు నందు.
ఈరోజు నుంచి ఇది నా రూమ్ కదా. నా అభిరుచికి తగ్గట్టుగా నేను మార్చుకున్నాను అంటుంది లాస్య. ఇదే నీలో ఉన్నది. నీ స్వార్థమే నువ్వు చూసుకుంటావు. నువ్వు ఇలాగే ఉంటే ఎప్పటికీ ఈ ఇంట్లో వాళ్లకి పరాయి మనిషివే.. అంటూ నందు సీరియస్ అవుతాడు.
నాకు అడ్డుగా వస్తే అందరినీ తీసి పడేస్తాను కానీ.. ఎవ్వరినీ బతిమిలాడే క్యారెక్టర్ కాదు నాది అనుకుంటుంది లాస్య. తులసి.. తన వాళ్లందరినీ ఓ రూమ్ కు తీసుకొస్తుంది. అదేంటి ఈ రూమ్ కు తీసుకొచ్చావు అని అడుగుతారు పిల్లలు. ఇక నుంచి ఇది నా రూమ్ అని చెబుతుంది. మీరు ఈ రూమ్ లో ఉండటం ఏంటి అని అంటారు అందరూ.
నన్ను ఇబ్బంది పెట్టకండి. ఈ రోజు నుంచి నేను ఇదే గదిలో ఉంటాను. నన్ను ఇబ్బంది పెట్టకండి అని అంటుంది తులసి. దీంతో ఈ ఇంట్లో ఉన్న అన్ని రూమ్ ల కంటే ఈ రూమ్ నే చాలా బాగా డెకరేట్ చేస్తాం.. అని చెప్పి అందరూ కలిసి రూమ్ ను బాగా డెకరేట్ చేస్తారు.
ఆ తర్వాత తులసి తులసి అంటూ అనసూయ పిలుస్తుంది. ఏంటి అత్తయ్య అంటే.. మన ఇంట్లో ఎవరో ఫుడ్ ఆర్డర్ చేశారట. ఆ డెలివరీ బాయ్ నాదగ్గర 500 వసూలు చేశాడు. దీన్ని ఎవరు బుక్ చేశారో తెలిస్తే వాళ్ల ముక్కు పిండి మరీ నా 500 వసూలు చేస్తా అని అనుకుంటుంది. ఇంకెవరు లాస్య ఆర్డర్ చేసి ఉంటుంది అని చెబుతుంది తులసి.
ఇంతలో లాస్య వచ్చి.. అది నేనే ఆర్డర్ చేశాను అని అంటుంది. ఈ చెత్తను ఆర్డర్ చేసింది నువ్వేనా అని కాసేపు అనసూయ లాస్యపై సీరియస్ అవుతుంది. నీ నందు కూడా తులసి వండిన వంటనే తింటాడు అని అనేసరికి.. ఇక నుంచి నువ్వు నందుకు వంట వండటానికి వీలు లేదు అంటుంది లాస్య.
అత్తయ్య మామయ్య రేపటి నుంచి నేను ఫ్యాక్టరీకి వెళ్తాను అంటుంది తులసి. దీంతో ఇప్పుడే ఎందుకమ్మా. నువ్వు ఇంకొన్ని రోజుల తర్వాత వెళ్దువులే అంటుంది అనసూయ. నువ్వు రేపటి నుంచి ఫ్యాక్టరీకి వెళ్తే.. కోడలు ఉంది కదా.. తను అందరికీ వండిపెడుతుందిలే అంటాడు పరందామయ్య.
ఇంతలో లాస్య వచ్చి.. నాకు ఏం పనిలేదా. మీ అందరికీ వండి పెట్టాలా. నేను కూడా జాబ్ కు వెళ్తాను అంటుంది. నీకు జాబ్ ఎక్కడిది అని అడుగుతుంది అనసూయ. నాకు, నందుకు జాబ్ లేదు. మేము కూడా జాబ్ చూసుకుంటాం అంటుంది లాస్య. ఇంతలో నందు వచ్చి.. అంటే ఏంటి.. మాకు జాబ్ లేదు అని దెప్పిపొడుస్తున్నావా అని అంటాడు.
తులసి కాదు అన్నది నీ పెళ్లామే నందుకు జాబ్ లేదు అని చెప్పింది అంటుంది అనసూయ. దీంతో నందు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. లాస్య వచ్చి ఇది తిను నందు అంటుంది. నాకు వద్దు నాకు ఆకలిగా లేదు అంటాడు నందు. తులసి మీద ఉన్న కోపాన్ని నామీద ఎందుకు చూపిస్తున్నావు అని అడుగుతుంది లాస్య.
నాకు కోపం తులసి మీద కాదు.. నీ మీదే.. అంటాడు. ఎప్పుడు చూడూ ఏదో ఒక వంక చూసుకొని నాకు జాబ్ లేదన్న విషయాన్ని గుర్తు చేస్తుంటావు. అది నీకు బాగా అలవాటు అయింది. నాకు జాబ్ లేదని నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు. జాబ్ ఉన్నోడినే చూసుకోవచ్చు కదా అంటాడు నందు.
త్వరలోనే జాబ్ సంపాదించి అందరి నోళ్లూ మూయిస్తాను అంటాడు నందు. మరోవైపు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని లాస్య ఇంట్లో తిరగడం చూడలేకపోతాడు పరందామయ్య. ఒరేయ్ నందు ముందు నీ పెళ్లాన్ని మంచి డ్రెస్సులు వేసుకోమని చెప్పు అంటూ నందుపై అనసూయ సీరియస్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.