Chatrapathi Movie : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా దాదాపు దశాబ్ద కాలం క్రితం వచ్చిన చత్రపతి సినిమాను ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వి వి వినాయక్ హిందీ లో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లుగా అధికారికంగా ప్రకటించారు. చత్రపతి సినిమా అంటే అప్పట్లోనే భారీ బడ్జెట్ సినిమా.. అంతే కాకుండా సినిమాను అత్యంత హై టెక్నికల్ వ్యాల్యూస్ తో దాదాపు ఏడాది కాలం పాటు జక్కన్న తెరకెక్కించినట్లుగా ప్రచారం జరిగింది.
అలాంటి సినిమా ను ఇప్పుడు అంతకు మించి టెక్నాలజీని వాడుతూ భారీ ఎత్తున విడుదల చేయాల్సి ఉంది. కాని వీళ్ల రీమేక్ పని తీరు చూస్తుంటే టాలీవుడ్ చత్రపతిలో కనీసం 50 శాతం కూడా హై తీసుకు రాలేక పోతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న మొన్ననే చత్రపతి ని ప్రారంభించారు.. మద్య మద్య లో కరోనా వల్ల షూటింగ్ పెద్దగా జరిగిన తీరే లేదు. అయినా కూడా చత్రపతి సినిమా షూటింగ్ ను ముగించేశాం.. త్వరలో తీసుకు వస్తాం అంటూ ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. నెటిజన్స్ వీళ్లు అసలు చత్రపతి సినిమా ను రీమేక్ చేశారా.. లేదం చందమామ కథలు వంటి చిన్న సినిమా ను రీమేక్ చేశారా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.
ప్రభాస్ నటించిన చత్రపతి లాంటి సినిమా లకు ఏళ్లకు ఏళ్లు టైమ్ తీసుకుంటేనే అద్బుత కళా కండాలుగా తెరపై చూపించగలరు. కాని వినాయక్ తన స్టైల్ లో కేవలం రెండు మూడు నెలల్లో సినిమాను ముగిస్తే జనాలు చూస్తారా లేదా అనేది అనుమానంగా నే ఉంది. అయితే కొందరు మాత్రం సినిమా షూటింగ్ ఇలా త్వరగా పూర్తి అవ్వడమే మంచి పద్దతి అంటున్నారు. ఎందుకంటే పాతిక కోట్ల లోపు బడ్జెట్ తో సినిమా ను పూర్తి చేస్తేనే బెల్లంకొండ బాబు మార్కెట్ కు ఒక మోస్తరు అన్నట్లుగా చెబుతున్నారు. హిందీ లో బెల్లం బాబుకు ఇమేజ్.. క్రేజ్ జీరో. అయినా కూడా పాతిక కోట్ల రూపాయలతో సినిమాను నిర్మించారు.
ఒక వేళ సినిమా అటు ఇటు అయితే ఖచ్చితంగా ఆ పాతిక కోట్లలో కనీసం 15 నుండి 20 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి బాలీవుడ్ లో ఇంత హడావుడిగా తీసి ముగించేసిన హిందీ చత్రపతి సినిమా ను ఎప్పుడు వదులుతారు అనేది చూడాలి. సినిమా ల విడుదల కు అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు. కనీసం మూడు నెలల వరకు అక్కడ సినిమాలు విడుదల అయ్యే అవకాశం లేదు. కనుక హిందీ చత్రపతి విడుదల అయ్యేందుకు కనీసం ఆరు నెలలు పట్టవచ్చు.. అంతకు మించే పట్టవచ్చు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.