Intinti Gruhalakshmi 7 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 డిసెంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 809 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటికైనా నన్ను నమ్మండి మామయ్య. నేను మారిపోయాను. నిజంగానే నేను రాక్షసిని అయితే ఈ ఇల్లు దక్కింది చాలు అని పండుగ చేసుకునేదాన్న కదా… ఇలా కన్నీళ్లు పెట్టుకునే దాన్ని కాదు అని అంటుంది లాస్య. దీంతో ఇవి నిజమైన కన్నీళ్లు కావు తాతయ్య అంటాడు ప్రేమ్. అవి మొసలి కన్నీళ్లు అంటాడు ప్రేమ్. దీంతో నేను ఏం చేస్తే నమ్ముతారు. గొంతు కోసుకుంటే నమ్ముతారా? ఆగండి అని చాక్ తెచ్చుకొని చేయి కోసుకోబోతుంది. దీంతో వద్దు అని ఆపుతారు అందరూ. నీ మీద మాకు కోపం ఉన్నమాట నిజమే కానీ.. నువ్వు ఇలా అఘాయిత్యం చేసుకుంటుంటే చూడలేం.. అంటాడు పరందామయ్య. దీంతో తాతయ్య మళ్లీ మోసపోతున్నారు అంటాడు ప్రేమ్.
దీంతో మోసపోవడం తప్పు కాదు.. మోసం చేయడం తప్పు అంటాడు పరందామయ్య. ఏ ఆస్తి వల్ల ఈ ఇల్లు ముక్కలు అయిందో.. ఆ ఆస్తి మాకు అక్కర్లేదు. ఈ ఇల్లు కోడలు పేరు మీదే ఉండాలని అనుకుంటున్నాం. దైవ నిర్ణయం అనుకుంటున్నాం అని చెప్పి తన డాక్యుమెంట్స్ తనకే ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు పరందామయ్య. తాతయ్య నిర్ణయం విని షాక్ అయ్యావా? గొడవలు వద్దు అనుకొని, ప్రశాంతంగా ఉండాలని మనసును చంపుకొని నిన్ను కోడలుగా ఒప్పుకున్నారు అంటుంది శృతి. గెలిచింది నువ్వు కాదు.. తాతయ్య, తాతయ్య మంచితనం అంటుంది. ఈ ఇంటి కోడలు స్థానానికి ఒక విలువ ఉంది. ఆ విలువ దిగజారేలాగా ప్రవర్తించకు అని చెప్పి శృతి, అంకిత.. లాస్యకు వార్నింగ్ ఇచ్చి వెళ్తారు.
మరోవైపు తనకు మళ్లీ ఇల్లు దక్కినందుకు సంతోషిస్తుంది లాస్య. మరోవైపు గిటార్ రిపేర్ చేయించుకొని ఇంటికి బయలుదేరుతారు తులసి, సామ్రాట్. నాకు ఓపిక లేదు అండి ఇక అంటాడు సామ్రాట్. ఎలా ఉంది ఈ అనుభవం అంటుంది తులసి. దీంతో ఇప్పుడు కాదు కానీ.. కాస్త ఓపిక తెచ్చుకున్నాక తర్వాత చెబుతా అంటాడు సామ్రాట్.
ఇంతలో వాళ్ల ఇల్లు వస్తుంది. దీంతో ఇంటికి చేరుకుంటారు. నాకు చాలా ఆనందంగా ఉంది అంటాడు. దీంతో మీరు చాలెంజ్ గెలిచారు అంటుంది తులసి. దీంతో ఈ గెలుపు గెలుపే కాదు అంటాడు సామ్రాట్. మధ్యతరగతి ఆడవాళ్లకు జోహార్లండి అంటాడు సామ్రాట్.
నిజంగా అంటున్నారా? లేక వెటకారం చేస్తున్నారా? అంటుంది తులసి. దీంతో ఉన్న సంపాదనలో సర్దుకుంటూ సంసారం చేయడం మామూలు విషయం కాదండి. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా కుప్పకూలిపోవడమే. ఇంటికి దీపం ఇల్లాలు అని ఊరికే అనడం లేదు అంటాడు సామ్రాట్.
మధ్యతరగతి ప్రజల జీవితం అంటే త్రిశుంఖ స్వర్గం.. అటూ ఇటూ ఊగులాడుతుంది. పాత సబ్బు ముక్కను కొత్త సబ్బు ముక్కతో కలిపి వాడుకోవడం, పాత న్యూస్ పేపర్ అమ్మి దానితో అవసరాలు తీర్చుకోవడం, చివరి వరకు పిల్లల స్కూల్ ఫీజులు కట్టకపోవడం.. ఇలా మధ్యతరగతి ప్రజల జీవితాలే ఇలా ఉంటాయి అంటుంది తులసి.
దీంతో నాకు ఆ మధ్యతరగతి జీవితం జీవించాలని ఉంది అంటాడు సామ్రాట్. అది కుదరదు. మీరు మీలా ఉండాలి.. నేను నాలా ఉండాలి అంటుంది తులసి. మరోవైపు ఇల్లు ఇస్తా తీసుకోండి అంటే కూడా ఎందుకు తీసుకోవడం లేదు అని అంటుంది లాస్య.
అసలు ఆ ఇంట్లో నీవైపు మాట్లాడేవాళ్లు ఒక్కరైనా ఉన్నారా? నువ్వు ఈ ఇంటిని తిరిగి ఇస్తానంటూ ప్రపోజల్ పెట్టడం వల్ల నీకు ఎంత మేలు జరిగిందో తెలుసా? అంటుంది భాగ్య. ఇప్పుడు నువ్వు చేయాల్సింది బావ గారిని నీవైపునకు తిప్పుకోవడం. ఎఫ్పుడైతే ఆయన ఓటు నీకు పడితే నీకే ప్లస్ అవుతుంది అంటుంది భాగ్య.
కట్ చేస్తే తెల్లవారుతుంది. ఉదయమే నిద్ర లేస్తాడు నందు. ఇంతలో కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది లాస్య. దీంతో కాఫీ తీసుకోడు. నందు.. ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు. కనీసం నా వైపు కూడా చూడటం లేదెందుకు అంటుంది లాస్య. మళ్లీ వచ్చి ఏమైంది నందు అంటూ నందును టచ్ చేస్తుంది.
దీంతో డోంట్ టచ్ అంటాడు నందు. నందు నేను ఏం చేసినా మన మంచి కోసమే కదా. మనం సుఖంగా ఉండాలనే కదా. మన ఫ్యూచర్ కోసమే కదా అంటుంది లాస్య. దీంతో మన ఫ్యూచర్ అని అనకు. నీ ఫ్యూచర్ అని చెప్పు. నీకోసం, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం నేను ఎంతో కోల్పోయాను. కానీ.. నువ్వు చేసిందేంటి. నా ప్రేమకు బదులుగా నువ్వు ఇచ్చింది అశాంతి.. అంటాడు నందు.
ఇప్పటికీ నేను అది ఫీల్ అవుతూ అనుభవిస్తున్నాను అంటాడు నందు. మన మధ్య జరిగింది ప్రశాంతంగా గుర్తు చేసుకో అంటుంది లాస్య. కట్టుకున్న మగాడిని మోసం చేసిన ఆడదాన్ని ఏ మగాడు క్షమించడు అంటాడు నందు. ఇంతలో తులసి పరందామయ్య ఇంటికి వస్తుంది.
ఇది నేను అల్లుకున్న గూడు. కానీ.. ఆ గూటిలో నేను లేను. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అని అనుకుంటుంది తులసి. షాపింగ్ చేసిన వస్తువులు అన్నీ తీసుకొని వస్తుంది తులసి. ఇంట్లోకి వస్తుంది కానీ.. ఎవ్వరూ కనిపించరు. ఇంతలో దివ్య చూసి మామ్ అంటూ హత్తుకుంటుంది.
మామ్ వచ్చంది అనగానే అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. అమ్మా తులసి ఎలా ఉన్నావమ్మా అని అడుగుతారు. అందరూ తనను హత్తుకుంటారు. తులసి.. అంటూ అనసూయ హత్తుకుంటుంది. ఎంత సేపు అయింది ఆంటి వచ్చి అని అడుగుతుంది శృతి.
దీంతో ఇప్పుడే వచ్చానమ్మా. అందరూ నన్ను మరిచిపోయి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారని అనుకున్నా అంటుంది తులసి. ఈ ఇంట్లో నువ్వుంటేనే అందం, ఆనందం అంటాడు పరందామయ్య. ఇంతలో లాస్యతో గొడవ పెట్టుకొని ఇక నుంచి నీ జీవితం నీది.. నా జీవితం నాది అని అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతాడు నందు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.