Intinti Gruhalakshmi 7 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ 7 సెప్టెంబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ రిలీజ్ అయింది. 418 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్ ఈ పెళ్లికి ఒప్పుకోడు.. అనే విషయం నాకు ముందే తెలుసు. అయినప్పటికీ.. ఈ విషయాన్ని ఫ్యామిలీ ముందే చెప్పడం కరెక్ట్ అని లాస్యకు చెబుతాడు నందు. జీకే ఫోన్ చేసినా కూడా.. ప్రేమ్ కొంచెం టైమ్ అడిగాడని.. ఓకే చెబుతాడని అబద్ధం చెబుతాడు. ఎలాగూ ప్రేమ్ టైమ్ అడిగాడు కాబట్టి.. ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం అని లాస్య, నందు అనుకుంటారు.
కట్ చేస్తే.. ప్రేమ్ తెగ ఆలోచిస్తుంటాడు. అసలు.. ఏం జరుగుతుందో ప్రేమ్ కు అర్థం కాదు. ఇలా.. సడెన్ గా పెళ్లి సంబంధం అనేసరికి.. ప్రేమ్ కు ఏం చేయాలో కూడా తోచదు. ఇంతలోనే తులసి అక్కడికి వస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు నాన్నా.. అంటుంది. ఇంకేం ఉంటుంది అమ్మ. నాన్న తీసుకొచ్చిన ప్రపోజల్ గురించి.. అంటాడు.
నువ్వు ఆపకపోయి ఉంటే.. ఏదో ఒకటి తేలిపోయి ఉండేది కదా అమ్మా.. అని చెబుతాడు ప్రేమ్. నువ్వు శృతిని ప్రేమిస్తున్నావని అందరికీ తెలుసు. కానీ.. శృతి అందరి ముందు ఎంత ఇబ్బందిగా గురయ్యేదో కదా. అందరి ముందు అలా అమ్మాయిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. తను ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉంది. ఈ ఇంటి మీద ఆధార పడి బతుకుతున్నాను.. అనే అభద్రతా భావం ఉంది. ఆ సమయంలో ఇలా డైరెక్ట్ గా అడిగితే.. తను చెప్పలేదు నాన్నా.
ఎందుకు అమ్మా.. శృతి చదువుకుంది కదా. తన మనసులో మాటను ఎందుకు చెప్పలేదు అంటుంది. చదువుకు, మనసుకు సంబంధం లేదు.. అని అంటుంది. ముందు నువ్వు శృతికి నీమీదున్న అభిప్రాయం తెలుసుకో. ఎలాగోలా.. నీ మనసులోని మాటను శృతికి తెలియజేయ్. ముందు ఆ పని చేయి. వెళ్లు.. ఆ తర్వాతే నీ అభిప్రాయాన్ని అందరికీ చెప్పు.. అని చెబుతుంది తులసి.
ఫ్యాక్టరీలో ఓ వర్కర్ కాళ్లకు నొప్పులు వస్తుంటాయి. నా వల్ల కావట్లేదు అంటుంది. మోకాళ్ల నొప్పి తీవ్రంగా ఉండటం వల్ల తను పనిచేయలేదు. ఇన్ని రోజులు కరెంట్ మిషన్ మీద పనిచేశాం కదా అమ్మా.. ఇప్పుడు తొక్కుతూ కుట్టాలి కాబట్టి.. నాకు కాళ్లు నొప్పులు పుడుతున్నాయమ్మా.. అని అంటుంది వర్కర్. అయ్యో.. నీకు నేనున్నాను.. మన ఫ్యాక్టీరికి అతి త్వరలోనే కరెంట్ ను తీసుకొస్తాను.. అని మాట ఇస్తుంది తులసి.
కట్ చేస్తే.. లాస్య తీవ్రంగా ఆలోచిస్తుంటుంది. అన్ని పద్ధతి ప్రకారం వెళ్లిపోవాలని నందు అంటాడు. అలా వెళ్లడం వల్ల ఏం జరగదు .. అని చెప్పితే అన్నీ నడవవు.. అని చెప్పినా వినడు. జీకే కూతురు అక్షరను ప్రేమ్ చేసుకోకపోతే.. నందు కంపెనీని మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.. అని అనుకుంటుండగానే.. అక్కడికి వచ్చిన భాగ్య.. లాస్యను హేళన చేస్తుంది. కాశీకి పోదాము రామా హరే.. అంటూ ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. నువ్వు ఇక భవిష్యత్తు మీద ఆశలు వదులుకోవాల్సిందే. అందుకే.. నువ్వు బావ గారిని నమ్ముకోవడం కంటే.. సన్యాసాన్ని నమ్ముకోవాలి.. అంటుంది.
లేదు భాగ్య.. ప్రేమ్ ఈ పెళ్లికి ఒప్పుకుంటే అన్ని సమస్యలు తీరుతాయి అంటుంది. కానీ.. ప్రేమ్ ఈ పెళ్లికి ఒప్పుకోడు కదా. శృతి ఉన్నన్ని రోజులు ప్రేమ్ ఈ పెళ్లికి ఒప్పుకోడు కాబట్టి.. శృతి అడ్డును తప్పించాలి లాస్య.. అని చెబుతుంది భాగ్య. మీకు వచ్చిన అవకాశాన్ని ఎంత త్వరగా వీలు అయితే అంత త్వరగా అందిపుచ్చుకోవాలి.. లేదంటే చెక్క భజన చేసుకోవాల్సిందే. ప్రేమ్ తన మనసులో ఉన్న ప్రేమ గురించి శృతికి చెప్పకముందే.. మనం జాగ్రత్త పడాలి.. అని చెబుతుంది భాగ్య. ఇద్దరినీ వేరు చేయాలి.. అని చెబుతుంది భాగ్య.
దీంతో అవును భాగ్య.. నిజమే కలపాలి అంటే కష్టం కానీ.. విడదీయడం ఎంత సేపు.. వెంటనే విడదీసేద్దాం అని చెబుతుంది లాస్య.
కట్ చేస్తే.. తులసి.. కరెంట్ ఆఫీసుకు వెళ్తుంది. మీకు ఇంత కరెంట్ బిల్లు రావడం ఏంటి అని అడుగుతుంది. అవును అండి.. అంత బిల్లు పొరపాటుగా వచ్చేసింది.. అని చెబుతుంది తులసి. అందుకే.. వెంటనే కరెంట్ బిల్లు కట్టేయండి.. కరెంట్ పునరుద్ధరిస్తాం.. అని చెబుతాడు కరెంట్ ఆఫీసర్.
అంత డబ్బు ఇప్పుడు లేదండి.. పవర్ లేకునే సరికి.. మిషన్లు సరిగ్గా పనిచేయడం లేదు. పని ఆగిపోతోంది.. దయచేసి త్వరగా కరెంట్ ను ఇప్పించండి.. అని చెబితే.. ఆ ఆఫీసర్ వినడు. ముందు ఒక కంప్లయింట్ ఇవ్వండి.. దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం అని చెబుతాడు. అది జరగాలంటే లేట్ అవుతుంది కదండి.. అని చెబుతుంది తులసి. అయినా కూడా ఆ ఆఫీసర్ వినడు. మీకు వెంటనే కరెంట్ కావాలంటే.. వెంటనే 3 లక్షల రూపాయలు కట్టండి.. అని చెబుతాడు.
దీంతో ఏం చేయాలో తెలియక బయటికి వచ్చేస్తుంది తులసి. బయటికి వచ్చి చూసేసరికి.. గిరిధర్.. అక్కడికి వస్తాడు. ఓ ఆఫీసర్ ను కలిసి.. నేను చెప్పింది చెప్పినట్టు చేశారు. ఆ ఫ్యాక్టరీకి అకారణంగా 3 లక్షల బిల్లు వచ్చేలా చేశారు. ఆ ఫ్యాక్టరీకి మహా అయితే 20 వేలో 25 వేలో బిల్లు వచ్చేది. కానీ.. 3 లక్షలు వచ్చింది. దీంతో బిల్లు కట్టలేక ఆ ఫ్యాక్టరీ వాళ్లు నానా ఇబ్బందులు పడుతున్నారు.. నాకు కావాల్సింది కూడా అదే.. అని చెబుతాడు గిరిధర్. కరెంట్ ఆఫీసర్ తో గిరిధర్ మాట్లాడి.. డబ్బులు ఇవ్వడం చూసి.. వెంటనే తన ఫోన్ లో రికార్డు చేస్తుంది తులసి.
వెంటనే మీ డ్రామా చాలా బాగుంది గిరిధర్. మొత్తం ఈ ఫోన్ లో షూట్ చేశా.. అని చెబుతుంది. మొత్తం వీడియో డిలీట్ చేయ్.. అని చెబుతాడు గిరిధర్. కుదరదు అని చెబుతుంది. ఇంతలోనే జీకే అక్కడికి వస్తాడు. జీకే అన్నీ చూస్తుంటాడు. గిరిధర్ తన ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు కానీ.. తను లాక్కోనీయదు.. వెంటనే గిరిధర్ చెంప దెబ్బ కొడుతుంది.
ఇంతలోనే కరెంట్ ఆఫీసర్ వస్తాడు.. ఏమైంది మేడమ్ ఏంటి గొడవ అంటాడు. వీడియో చూపిస్తుంది. వీడియో మొత్తం చూసి.. ఐమ్ సారీ మేడమ్.. అంటాడు. మీ ఉద్యోగాలు, భవిష్యత్తు నా చేతుల్లో ఉన్నాయి.. అని బెదిరిస్తుంది.
వెంటనే నా ఫ్యాక్టరీకి కరెంట్ ఇస్తారా? లేక టీవీ చానెళ్లకు వీడియోను ఇవ్వాలా? అని బెదిరిస్తుంది తులసి.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే.. తరువాయి భాగంలో చూడాల్సిందే.
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
This website uses cookies.