
intinti gruhalakshmi 8 july 2022 full episode
Intinti Gruhalakshmi 8 July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 జులై 2022, శుక్రవారం ఎపిసోడ్ 679 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రేపు సంజన సింగింగ్ కాంపిటిషన్ ఏర్పాటు చేసింది. మనం తప్పకుండా వెళ్లాలి అని నందుతో చెబుతుంది లాస్య. నాకు మూడ్ లేదు అని నందు అన్నా కూడా ఏం కాదు.. వెళ్దాం అని చెబుతుంది. మరోవైపు పాట రాయలేకపోతాడు ప్రేమ్. రాత్రి అవుతుంది కానీ.. పాట రాయడు. తులసి కూడా ప్రేమ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సంజన ఫోన్ చేసి మీ వాడు ఇంకా నాకు ఫోన్ చేయలేదు.. మాట్లాడలేదు. మీవాడు కాంపిటిషన్ కు ప్రిపేర్ అవుతున్నాడు కదా అని అడుగుతుంది సంజన. దీంతో ప్రిపేర్ అవుతున్నాడు. వాడి బాధ్యత నాది అని చెబుతుంది తులసి. దీంతో సరే అని ఫోన్ పెట్టేస్తుంది సంజన.
intinti gruhalakshmi 8 july 2022 full episode
ఇంతలో తులసి వెళ్లి తన డైరీ తీసి చదువుతుంది. ఇవన్నీ నువ్వు రాసిన పాటలేరా. నీలోని సత్తా అది అని అంటుంది. ఈరోజు ఎందుకురా నువ్వు పాట రాయలేకపోతున్నావు అని అంటుంది. నేను లేనని దిగులు పడుతున్నావా అని అనుకుంటుంది. ఇంతలో అంకిత వచ్చి అవును అంటుంది. ప్రేమ్ ఇంతకుముందులా యాక్టివ్ గా, హుషారుగా ఉండాలంటే మీరు ప్రేమ్ కు దగ్గరవ్వాల్సిందే.. తప్పదు అని చెబుతుంది అంకిత. అభిని నేను కలవకపోవడంలో నాది మొండితనం అని మీరు అంటున్నారు. ప్రేమ్ విషయంలో మీరు కూడా అదే చేస్తున్నారు. మీరు ఇక్కడ బాధపడుతుంటే ప్రేమ్ అక్కడ బాధపడుతున్నాడు. మీరిద్దరూ సంతోషంగా లేరు ఆంటి. మీకు చెప్పేంత వయసు కానీ.. అనుభవం కానీ.. నాకు లేవు ఆంటి. ప్రేమ్ కు ఎప్పటికీ బలమే ఆంటి.. బలహీనత మాత్రం కాదు. ఈ టైమ్ లో మీరు ప్రేమ్ పక్కన ఉండటం ఎంతో అవసరం ఆంటి. ఆలోచించుకోండి అని చెబుతుంది అంకిత. ప్రేమ్ పక్కనే ఉండి వాడిలో ధైర్యం నింపాలి అని అనుకుంటుంది తులసి.
కట్ చేస్తే తులసి వెంటనే ప్రేమ్ ఇంటికి వెళ్తుంది. అతడిని మోటివేట్ చేస్తుంది. నా కొడుకు గెలిచాకే వద్దామనుకున్నా. నా బిడ్డ ఎవరి కంటే తక్కువ కాదు అని లోకమంతా గర్వపడేలా అరిచి చెబుదామనుకున్నా. నా బిడ్డ నన్ను ఎక్కడ మోసం చేస్తాడో అని టెన్షన్ పడుతున్నా.
అమ్మంటే నీకిష్టం. ప్రాణం. ప్రపంచం. అది నాకు తెలుసురా. ఇష్టమైన మనిషి కోసం.. ఆ మనిషి ఇష్టమైన పని చేస్తేనే నీ ఇష్టానికి అర్థం అంటుంది తులసి. అమ్మ దూరంగా ఉంచిందన్న భయంతో నీ శక్తిని నువ్వు మరిచిపోవడం కాదు అంటుంది తులసి. కష్టం వస్తే కుమిలిపోవడం కాదు చేయాల్సింది. కష్టాన్ని ధైర్యంగా దాటాలి అంటుంది తులసి.
అమ్మ.. ఒక్కసారి నీ భుజం మీద తలపెట్టుకోవచ్చా. నీ దగ్గరికి రావచ్చా అంటాడు ప్రేమ్. దీంతో రా నాన్న అంటుంది తులసి. దీంతో తన దగ్గరికి వెళ్లి తులసిని గట్టిగా హత్తుకుంటాడు ప్రేమ్. నీ మాటను నెరవేర్చుతాను. నీ కలను గెలిపిస్తాను. అలా కాకపోతే నేను నీ కొడుకునే కాదు అంటాడు ప్రేమ్.
దీంతో అక్కడే ఉన్న గిటార్ ను తీసుకొచ్చి తనకు ఇస్తుంది. నీకు ఈ అమ్మ ప్రేమతో నీ పుట్టిన రోజు నాడు ఇచ్చిన బహుమతి. నీకు గుర్తుందా అంటుంది తులసి. దీన్ని నేను మరిచిపోతే.. ఈ అమ్మను మరిచిపోయినట్టే అంటాడు ప్రేమ్. ఆ తర్వాత గిటార్ ను ప్లే చేస్తాడు ప్రేమ్..
కట్ చేస్తే పాటల పోటీలు ప్రారంభం అవుతాయి. అందరూ అక్కడికి వెళ్తారు. కాంపిటిషన్ కు అభి కూడా వస్తాడు. వీడు ఎందుకు వచ్చాడు అంటాడు పరందామయ్య. నువ్వు పిలిచావా అని అంకితను అడుగుతాడు. కారణం ఏదైనా వచ్చాడు కదా అంటుంది అంకిత.
కంగ్రాట్స్ రా ప్రేమ్. అదృష్టవంతుడివి. నీకు ఇష్టమైన మామ్ నీ పక్కన ఉంది. కొందరు దురదృష్టవంతులు.. అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అందరూ లోపలికి వెళ్లబోతుండగా.. అక్కడికి నందు, లాస్య, భాగ్య కూడా వస్తారు. వాళ్లను చూసి షాక్ అవుతుంది లాస్య.
నిన్నటి వరకు ప్రేమ్ ను దూరంగా ఉంచి.. ఈరోజు చేయి పట్టుకొని ఊపుకుంటూ వస్తుంది అని అనుకుంటుంది లాస్య. మళ్లీ అనుకోకుండా కలిశామా అని అంటుంది లాస్య. దీంతో అనుకొని కలిసేంత బంధం మన మధ్య లేదు కదా అంటుంది తులసి. చెంపదెబ్బ కొట్టి ఇంట్లో నుంచి తరిమేశావు. అప్పుడే మళ్లీ చేయి పట్టుకొని నడుస్తున్నావు అంటుంది లాస్య.
దీంతో అది నీకు అర్థం కాదు అంటుంది తులసి. నా కొడుకు కాంపిటిషన్ లో పాల్గొనడానికి వచ్చాడు అంటుంది. ఆల్ ది బెస్ట్ ప్రేమ్ గెలుద్దువు కానీ అంటుంది లాస్య. ఇలా వాడిని గారాబం చేసే వాడిని ఎందుకు పనికి రాకుండా చేసింది అని నందు ప్రేమ్ పరువు తీస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
ఒకప్పుడు బంగారం అంటే టక్కున కొనేవారు..కానీ ఇప్పుడు బంగారం పేరు చెపితేనే వామ్మో అంటున్నారు. గత ఐదేళ్లుగా బంగారం ధరలు…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 జనవరి 20 ఎపిసోడ్లో కథ ఒక్కసారిగా ఉత్కంఠకు చేరింది.…
Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
This website uses cookies.