Intinti Gruhalakshmi 9 Dec Today Episode : తులసి ఉగ్రరూపం.. క్యాన్సర్ వచ్చిందని జాలి చూపించకండి అంటూ.. అందరిపై సీరియస్

Intinti Gruhalakshmi 9 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 డిసెంబర్ 2021, గురువారం ఎపిసోడ్ 498 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అందరూ తనపై చూపిస్తున్న కాదు నటిస్తున్న ప్రేమను చూసి జానకికి కోపం వస్తుంది. ఆ కోపంలో తెగ నవ్వేస్తుంది జానకి. పిచ్చిదానిలా జానకి నవ్వుతుంటే.. అందరూ షాక్ అవుతారు. అదేంటి.. అందరూ నవ్వకుండా ఆపేశారు ఏంటి. నవ్వండి.. నవ్వండి అంటుంది తులసి. ఇదే కదా.. మీరు చేసింది. నేను నవ్వడం కోసమే కదా మీరంతా చేసింది. ఇప్పుడెందుకు అలా ఉన్నారు. అత్తయ్య.. మీకేం కావాలి. మీరు చేసిన స్వీటు నేను తినాలి. నా ముఖంలో మీరు సంతోషం చూడాలి. అంతే కదా. తినిపించండి.. చాలా.. చాలా అంటూ స్వీటును తింటుంది. దివ్య నా బంగారు తల్లి.. నా కోసం ఏం చేశావు అమ్మ. జింజర్ టీ కదా. తాగేస్తాను అమ్మా.. మొత్తం తాగేస్తాను.

intinti gruhalakshmi 9 december 2021 full episode

అమ్మా అంకిత.. నాకోసం ఏం చేశావు తల్లి.. పానీపూరీ కదా.. తినేస్తాను. మొత్తం తినేస్తాను. ఇంకా ఏం చేయాలి.. ఆ.. అభి.. నా కోసం కష్టపడి.. పాత సినిమాలన్నీ డౌన్ లోడ్ చేశావు కదా చూసేద్దాం. పాత సినిమాలు అన్నీ వరుస పెట్టి చూసేద్దాం సరేనా. ఏమండి నాకు ఆరుబయట వెన్నెల్లో భోజనం చేయడం నాకు ఇష్టం అని మీకు ఇంకా గుర్తుందా? చూశారా మామయ్య.. మీ అబ్బాయికి నేనంటే ఇష్టం లేకపోయినా.. నా ఇష్టాలను ఇంకా మరిచిపోలేదు. అన్నట్టు.. శృతి నువ్వు నాకోసం ఏం చేశావమ్మా.. ప్రేమ్ నువ్వేం చేశావురా. మీరంతా నాకోసం.. నా సంతోషం కోసం.. నేను నవ్వుతూ ఉండటం కోసం ఏం చేశారో చెప్పండి.. అంటూ అందరినీ అడుగుతుంది తులసి. దీంతో అందరూ షాక్ అవుతారు. తులసి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో ఎవ్వరికీ అర్థం కాదు.

తులసి.. ఏంటి ఇదంతా.. ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు.. అని అడుగుతాడు నందు. నాకు ఏమైందో ఇక్కడున్న అందరికీ తెలుసు. కానీ.. మీరు నన్నే అడుగుతున్నారా.. నాకేమైందో అని. మీకు.. మీకు.. మీకు.. అందరికీ తెలుసు. తెలియని అల్లా నాకు ఒక్కదానికే. నేనే పిచ్చిదాన్ని. ఇన్నిరోజులు మా ఆయనే నన్ను మోసం చేశాడని అనుకున్నా. కానీ.. ఈరోజు మీరంతా ఆయనతో చేరిపోయారు అంటూ చప్పట్లు కొడుతుంది తులసి.

దీంతో అందరూ షాక్ అవుతారు. నా మెడికల్ రిపోర్ట్స్ గురించి నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచారు. ఎందుకు చెప్పలేదు.. ఎందుకు.. అంటూ నందును ప్రశ్నిస్తుంది తులసి. ఒరేయ్ ప్రేమ్.. నాకు క్యాన్సర్ ఉందని ఎందుకు దాచిపెట్టావు అని అడుగుతుంది తులసి.

Intinti Gruhalakshmi 9 Dec Today Episode : అందరిపై ఫైర్ అయిన తులసి

అలా దాచిపెట్టే హక్కు నీకెవరు ఇచ్చారు అని ప్రశ్నిస్తుంది తులసి. నేను చచ్చిపోతానన్న నిజాన్ని ఎందుకు దాచిపెట్టారు. పైగా.. అస్సలు అందరూ ఎన్నిరోజులు ఆ నిజాన్ని దాచిపెట్టాలని అనుకున్నారు. దాచిపెట్టి లాభం ఏంటి. క్యాన్సర్ ఏమైనా మన బంధువా.. పట్టించుకోకపోతే పారిపోవడానికి.. అంటుంది.

అసలు.. మీరేమనుకున్నారు. నాకు క్యాన్సర్ అన్న విషయాన్ని దాచిపెడితే.. నా చావు వాయిదా పడుతుందనుకున్నారా అంటుంది. దీంతో షటప్ తులసి అంటాడు నందు. నీ చావు గురించి ఇంకొక మాట మాట్లాడావంటే.. అంటాడు. నువ్వు చావడం లేదు అంటాడు.

నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు. మా అందరినీ బాధపెడుతున్నావు అంటాడు. ఇప్పటి దాకా నీ గుండెల్లో బాధ బయటికి వచ్చేస్తే నీ మనసు తేలికపడుతుందని చూస్తూ ఊరుకున్నా. కానీ.. నువ్వు ఏదేదో మాట్లాడేస్తున్నావు తులసి. దయచేసి.. నీ చావు గురించి మాత్రం మాట్లాడకు. అసలు ఈ విషయం నీకు ఎలా తెలిసిందో నాకు అర్థం కావడం లేదు.

ఇంకా నీ ఫైనల్ రిపోర్ట్స్ రావాలి. అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేస్తే ఎలా. నీ ఫైనల్ రిపోర్ట్స్ వచ్చేవరకు.. ఇవన్ని మాటలు మాట్లాడకు. నీకు మా మీద అరవాలని ఉంటే.. నీ ఇష్టం. కానీ.. అది ఫైనల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే. ఒరేయ్ ప్రేమ్.. నువ్వైన తనకు అర్థం అయ్యేలా చెప్పరా.. అంటుంది. సారీ అమ్మ.. ఈ విషయం.. అంటూ ప్రేమ్ అనగానే మాట్లాడకు.. అస్సలు మాట్లాడకు అంటుంది.

మీ నాన్నకు ఎలా కనిపిస్తున్నానురా నేను అంటుంది. తులసి.. ఇక్కడ. నాకెవ్వరి సానుభూతి అక్కర్లేదు. ఎవ్వరూ నా విషయంలో వివరణ ఇచ్చే అవసరం లేదు. ఒకప్పుడు ఈ తులసి బలహీనురాలు కావచ్చు కానీ.. ఇప్పుడు కాదు. మీరందరూ నావాళ్లు. నా ప్రాణం. ఈ విషయం మీకు తెలుసు. మీరందరూ ఈ ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నారు. నాకోసం బాధపడుతున్నారు.

మీరందరూ నాకోసం ఏదైనా చేయాలనుకుంటే దయచేసి ఒక్కటి చేయండి. ఈ ప్రాణం లేని నవ్వులు.. ప్లాస్టిక్ నవ్వులు ఆపేయండి.. అని అంటుంది తులసి. మీరందరూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నా కానీ.. నన్ను సంతోష పెట్టడానికి ఈ ఆడంబరమైన నవ్వులు వద్దు. మీ అందరి ప్రేమ కావాలి ఇవ్వండి కానీ.. జాలి చూపించకండి.. అంటుంది తులసి.

కన్నీళ్లకే నా మీద జాలి లేదు. మీరందరూ ఎందుకు నా మీద జాలి చూపిస్తున్నారు. ఎవ్వరూ అవునన్నా.. కాదన్నా.. చావుతో నేను యుద్ధం చేస్తున్నాను. నా మీద జాలి చూపించాలి అనుకుంటే. యుద్ధం మధ్యలో కాదు. యుద్ధం ముగిశాక చూపించండి. నేను ఓడిపోతే అప్పుడు చూపించండి.

అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది తులసి. దీంతో అందరూ వచ్చి తన మీద పడి ఏడుస్తారు. తులసి కూడా ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే

CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…

2 hours ago

Corona | కరోనా త‌గ్గిన వీడని స‌మ‌స్య‌.. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు..!

Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…

3 hours ago

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

5 hours ago

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

7 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

9 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

11 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

12 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

13 hours ago