Home » Entertainment » Ram Charan Jr Ntr Rrr Movie Trailer
Entertainment

RRR Movie Trailer : జక్కన్న మార్క్.. ఉగ్రరూపంలో రామ్‌చరణ్, తారక్ .. ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ రిలీజ్

Authored By
mallesh
The Telugu News | Published on: December 9, 2021, 12:09 pm
Advertisement

RRR Movie Trailer : మూవీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. సుమారు 3 నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్‌ రిలీజ్ అయిన క్షణాల్లోనే మిలియన్ వ్యూవ్స్‌ను సొంతం చేసుకుంది. ట్రైలర్ చూస్తున్నంత సేపు మనం ఇంకా బ్రిటిష్ కాలంలోనే ఉన్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. పులికి ఎదురుగా ఎన్టీఆర్ అరుస్తూ నిల్చున్న ఉన్న సీన్ హెలెట్ అని చెప్పాలి. కొన్ని సీన్లు మాత్రం రోమాలు నిక్కబొడుచునేలా ఉన్నాయి. ఒక గోండు అమ్మాయిని కిడ్నాప్ చేసి బ్రిటీష్ వారికి వారి ఎన్టీఆర్ క్యాలిబర్ గురించి వారి గుమాస్తా చెప్పడం ఆకట్టుకుంది.

Advertisement

ఫైటింగ్ సీన్స్ సినిమాకు చాలా హైలెట్ గా ఉన్నాయని చెప్పుచ్చు. టోటల్ గా దీన్ని ఓ విజువల్ వండర్ లా తీర్చిదిద్దింది మూవీ యూనిట్. ఇక పోలీస్ అధికారి, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో రామ్ చరణ్ ఒదిగిపోయారు. ఎన్టీఆర్, రాంచరణ్ మధ్య కినిపించే సన్ని వేశాలు చూస్తుంటే స్నేహానికి విలువనిచ్చే క్యారెక్టర్స్ అని క్లియర్ గా అర్థమవుతోంది.ఇందులో బ్రిటిష్ వారి దగ్గర పనిచేసే గుమాస్తా పాత్రలో రాజీవ్ కనకాల కనిపించారు. తెలంగాణ యాసలో ఎన్టీఆర్ డైలాగ్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్. ఇక ఆలియాబట్, అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

ram charan jr ntr rrr movie trailer

Advertisement

ఈ మూవీ వచ్చే సంవత్సరం జనవరి 7న రిలీజ్ కానుంది. ఈ మూవీకి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించగా.. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించారు. భారీ అంచనాల మీద ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ మూవీ కోసం చాలా ఇండ్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు. మరి ట్రైలర్ తోనే రికార్డులను సొంతం చేసుకుంటున్న ఈ మూవీ.. థియేటర్స్ లోకి అడుగుపెడితే ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందోనని అంటున్నారు సినీ విశ్లేషకులు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి