intinti gruhalakshmi 9 september 2022 full episode
Intinti Gruhalakshmi 9 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 సెప్టెంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 733 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హనీకి ఇప్పుడు అబద్ధం చెప్పి ఎలాగోలా మేనేజ్ చేశావు. కానీ.. రేపు హనీకి నిజం తెలిస్తే ఎలా. తనను తులసి ఇంటికి ఎలా తీసుకెళ్తావు అని అడుగుతాడు బాబాయి. కావాలని నువ్వు హనీని రెచ్చగొడుతున్నావు బాబాయి. ఒకటి గుర్తుపెట్టుకో. ఇక నుంచి నా జీవితంలో నేను ఎప్పుడూ తులసిని కలవను.. కలిసే ప్రసక్తే లేదు అని చెబుతాడు సామ్రాట్. మరోవైపు లక్కీ.. డ్రాయింగ్ షీట్స్ కొనేందుకు స్టేషనరీ వెళ్తాడు. ఇంతలో అక్కడికి హనీ వస్తుంది. తను కూడా డ్రాయింగ్ షీట్స్ తీసుకుంటుంది. ఇద్దరూ కలిసి బయటికి వస్తారు. ఇంతలో వినాయకుడు, ఇతర సామాగ్రిని కొంటూ ఉంటారు తులసి, దివ్య. ఇంతలో హనీ.. తులసిని చూస్తుంది. తులసి ఆంటి అంటూ హనీ, లక్కీ గట్టిగా అరుస్తారు. హనీ అయితే రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వచ్చి తులసి దగ్గరికి వెళ్తుంది. లక్కీ కూడా వస్తాడు.
intinti gruhalakshmi 9 september 2022 full episode
ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. నేను కూడా అందరితో సరదాగా గడపాలని ఉంది. నేను రేపు మీ ఇంటికి వినాయకుడి పూజకు రావచ్చా ఆంటి అని అడుగుతుంది హనీ. దీంతో సరే రా.. నువ్వు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. అది నీ ఇల్లే అనుకో అంటుంది తులసి. దీంతో ఆంటి మరి నేను ఏం పాపం చేశాను. నేను కూడా మీ ఇంటికి వస్తాను. వినాయక పూజ కోసం వస్తా అంటాడు లక్కీ. దీంతో సరే.. రా అంటుంది తులసి. మరోవైపు తన అత్తయ్యకు ఫోన్ చేసి డబ్బులు అవసరం పడ్డాయి. ఒక ఐదు వేలు నా అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయవా అని అడుగుతుంది శృతి. తన మాటలు వింటాడు ప్రేమ్. తన దగ్గరికి వస్తాడు. దీంతో ఏంటి నీ ప్రాబ్లమ్ అని అడుగుతుంది శృతి. నేను కూడా అదే అడుగుతున్నా. అమ్మ కోసం నా భార్యగా ఈ ఇంట్లో బంధీగా ఉండిపోయావు. కనీసం ఏదో ఒక రోజు నీ మనసు మార్చుకొని నాకు దగ్గరవుతావని ఆశ పడ్డాను. కానీ.. ఏమాత్రం నువ్వు తొణకడం లేదు. చాలా బాగా నటిస్తున్నావు అంటాడు ప్రేమ్.
అంటే భార్యగా నటిస్తున్నావు అంటాడు. నువ్వు ఏం చెప్పాలనుకున్నావో సూటిగా చెప్పు. నాకు లోపల పని ఉంది అంటుంది శృతి. నేను హ్యాపీగానే ఉన్నాను. నన్ను డిస్టర్బ్ చేయకు అంటుంది శృతి. దీంతో ఎందుకు ఇంత మొండితనం శృతి. అల్టిమేట్ గా మనం సాధించేదేంటి అని అడుగుతాడు ప్రేమ్
మరోవైపు సామ్రాట్ కోపంగా ఎవరితోనే పోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో హనీ అక్కడికి వచ్చి సామ్రాట్ ను చూసి భయపడుతుంది. మరీ అరుస్తున్నారు ఏంటి నాన్న అని అడుగుతుంది. అరవడం ఏం లేదు.. అంటాడు. నాన్న నేను నీకు ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను అంటుంది హనీ.
ఏంటి అని అడుగుతాడు సామ్రాట్. దీంతో తులసి ఆంటి ఊరి నుంచి వచ్చేసింది. నాకు రోడ్డు మీద కనిపించేసింది అంటుంది హనీ. దీంతో కిందికి దిగు అంటాడు. మరి తులసి ఆంటి ఏమని చెప్పింది అని అడుగుతాడు బాబాయి. దీంతో తను ముందు షాక్ అయింది.
నాకు తులసి ఆంటి లాగా వినాయకుడి పూజ చేసుకోవాలని ఉంది. రేపు మీ ఇంటికి రావచ్చా అని తులసి ఆంటిని అడిగాను. నేను అడిగితే తులసి వద్దనడమా.. తప్పకుండా రమ్మంది. నా పుస్తకాలన్నీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తానని చెప్పింది. వాటి మీద పసుపుతో కూడా రాస్తారట. అలా చేస్తే చదువు బాగా వస్తుందట.
నాన్నా వింటున్నావా అని అడుగుతుంది హనీ. మీ నాన్నను అడగకుండా తులసి ఆంటికి చెప్పేశావు. మీ నాన్న వద్దంటే ఏం చేస్తావు అని అడుగుతాడు బాబాయి. దీంతో నేను తులసి ఆంటి వాళ్ల ఇంటికి వెళ్లడం మా నాన్నకు చాలా ఇష్టం కదా నాన్న అంటుంది హనీ.
దీంతో తనకు ఏం సమాధానం చెప్పాలో సామ్రాట్ కు అర్థం కాదు. మరోవైపు లక్కీ కూడా లాస్యతో రేపు తులసి ఇంటికి వెళ్తా అంటాడు. నా అరేంజ్ మెంట్స్ నేను చేసుకున్నా. మీరేం టెన్షన్ పడకండి. మీరు ప్రశాంతంగా ఇంట్లో పూజ చేసుకోండి. హనీ కూడా తులసి ఆంటి వాళ్ల ఇంటికి పూజకు వస్తోంది అంటాడు లక్కీ.
ఆ తర్వాత తులసి ఇంటి వద్ద లాస్య, నందు రహస్యంగా మాట్లాడుకోవడం వింటాడు సామ్రాట్. దీంతో లాస్య అసలు స్వరూపం సామ్రాట్ కు తెలుస్తుందా? ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
This website uses cookies.