Intinti Gruhalakshmi Kasthuri about her career and assets
Intinti Gruhalakshmi Kasthuri : మీకు కస్తూరి నటి తెలుసా అంటే బిక్క మొహం వేస్తారు కావచ్చు కానీ.. మీకు ఇంటింటి గృహలక్ష్మి తులసి తెలుసా అంటే మాత్రం ఎస్ అంటారు. అవును.. మేము మాట్లాడేది ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ హీరోయిన్ తులసి గురించే. తన పేరు కస్తూరి కానీ.. తన పేరుకంటే కూడా తులసిగానే ఎక్కువ ఫేమస్ అయింది. తెలుగు వాళ్లకు దగ్గరయింది. నిజానికి తులసి పాత తరం హీరోయిన్. తను కమల్ హాసన్ భారతీయుడు సినిమాలో కూడా కనిపించింది. పలు సినిమాల్లో హీరోయిన్ గానూ నటించిన తర్వాత కస్తూరి సినిమా ఇండస్ట్రీని వదిలేసింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు మళ్లీ సీరియల్ నటిగా బుల్లితెర మీదికి వచ్చింది.
అప్పట్లో పరంపర అనే వెబ్ సిరీస్ లోనూ కాస్త ఘాటుగానే నటించింది కస్తూరి. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ సూపర్ డూపర్ హిట్ అవడంతో తనకు వరుసగా సినిమా, వెబ్ సిరీస్ ల ఆఫర్లు వస్తున్నాయి. కస్తూరి చాలా యాక్టివ్ నటి. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఆ యాక్టివ్ నెస్ వల్లనే తనకు చాలా సమస్యలు వచ్చి చేరుతుంటాయి. తనకు వచ్చే పాజిటివ్, నెగెటివ్ ట్వీట్లకు అన్నింటికీ కస్తూరి రిప్లయి ఇస్తుంటుంది. ఇటీవల మెట్రో ట్రైన్ లో ప్రయాణిస్తుండగా తన ఫోన్ పోయిందట. దీంతో వెంటనే మెట్రో అధికారులకు ఫిర్యాదు చేసిందట కస్తూరి. వాళ్లు కూడా వెంటనే రంగంలోకి దిగి తన ఫోన్ కనిపెట్టి ఇచ్చారట. దీంతో చెన్నై అధికారుల పట్ల ఉన్న గౌరవం పెరిగిందంటూ కస్తూరి ఓ ట్వీట్ చేసింది.
Intinti Gruhalakshmi Kasthuri about her career and assets
ఆ ట్వీట్ ను చూసిన నెటిజన్లు ఇక ఆగడం లేదు. అసలు నీకు సొంతంగా కారు లేదా? వాటిలో ప్రయాణించవచ్చు కదా.. ఎందుకు మెట్రో ట్రెయిన్ ఉపయోగించడం. ఇదంతా పబ్లిక్ స్టంట్ కాదు కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేయగా.. నాకు కారు లేదు, ఏసీ లేదు. చివరకు టీవీ కూడా లేదు. నేను చాలా సాధారణమైన వ్యక్తిని. చాలా సాధారణ జీవితాన్ని గడుపుతాను.. అంటూ రిప్లయి ఇచ్చింది కస్తూరి. దీంతో నువ్వు సంపాదించిన సంపాదన అంతా ఏం చేశావు.. ఏం చేస్తున్నావు అంటూ అడగడంతో మెడికల్ హెల్ప్, క్యాన్సర్ తో పోరాడుతున్న పిల్లల కోసం ఖర్చు పెడుతా అంటూ తన దాతృత్వాన్ని బయట పెట్టింది కస్తూరి. దీంతో అందరూ తనను తెగ మెచ్చుకుంటున్నారు.
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
This website uses cookies.