Home » Entertainment » Intinti Gruhalakshmi Kasthuri Reacts Vijay Dalapathy Leo Movie
Entertainment

Intinti Gruhalakshmi Kasthuri : లియో సినిమాపై మంట పెట్టిన కస్తూరి శంకర్ .. నెట్టింట్లో ట్రోలింగ్..!

Authored By
aruna
The Telugu News | Updated on: October 24, 2023, 10:38 pm
Advertisement

Intinti Gruhalakshmi Kasthuri : కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి లేటెస్ట్ మూవీ ‘ లియో ‘ తాజాగా విడుదలైంది. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఖైదీ, విక్రమ్ సినిమాల తర్వాత లోకేష్ సినిమాలకి క్రేజ్ పెరిగింది. కోలీవుడ్లో స్టైలిష్ మేకర్ గా లోకేష్ కు పేరు వచ్చింది. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా 400 కోట్లకు పైగా వసూళ్లు చేయడంతో లోకేష్ కు డిమాండ్ పెరిగింది. దీంతో విజయ దళపతితో చేసిన లియో సినిమా కూడా అదే రేంజ్ లో అంచనాలను అందుకుంటుందని ఊహించారు. అయితే ట్రైలర్ వచ్చాక లియో సినిమాపై కాస్త ట్రోలింగ్ మొదలైంది. విజయ్ లుక్ మీద విమర్శలు వచ్చాయి.

Advertisement

లియో ట్రైలర్ ను ట్రోలర్స్, మీమర్స్ డీ కోడ్ చేయడం ప్రారంభించారు. తెలుగులో వచ్చిన గాయం 2 సినిమాలా ఉందని కొందరు, ఏ హిస్టరీ ఆఫ్ వయలెన్స్ సినిమాలా ఉందని మరికొందరు ట్రోల్ చేయసాగారు. కానీ లోకేష్ మాత్రం వీటిపై ఎక్కడా స్పందించలేదు. థియేటర్లో కూర్చున్న వారికి ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. ఏ హిస్టరీ ఆఫ్ వయోలెన్స్ సినిమాకు క్రెడిట్ ఇచ్చినట్లుగా టైటిల్ లో వేసేశాడు. ఇప్పుడు అదే విషయంపై కస్తూరి శంకర్ స్పందించారు. లోకేష్ కనగరాజ్ తీసిన లియో సినిమా ఏ హిస్టరీ ఆఫ్ వయోలెన్స్ సినిమాకు నివాళినా, అలా అయితే ఒరిజినల్ సోర్స్ ని తీసేస్తే అసలు ఈ సినిమా చూసేందుకు బాగుంటుందా, ఆ బూతు మాటలను వినిపించకుండా చేసినంత మాత్రాన ఏమైనా తేడా ఉందా అంటూ ట్వీట్ వేసింది.

Intinti Gruhalakshmi Kasthuri reacts vijay dalapathy Leo movie

Advertisement

దీంతో ఇంటింటి గృహలక్ష్మి కస్తూరి శంకర్ వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొంతమంది నెటిజన్లు మాత్రం లియోను ట్రోల్ చేస్తున్నారు. లోకేష్ నిరాశపరిచాడని కొందరు అంటుంటే, మరికొందరు సినిమాలోని మెయిన్ ట్విస్టులు, ఎల్సియు ని ఎలా కనెక్ట్ చేశాడో చెప్పేస్తూ సినిమా మీద ఆసక్తి తగ్గిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఏ హిస్టరీ ఆఫ్ వయోలన్స్ సినిమాకు నివాళి కాదు నిజంగానే కాపీ అని కౌంటర్లు వేస్తున్నారు. టైటిల్స్ కూడా క్రెడిట్ ఇచ్చాడని ట్వీట్స్ పెడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే లియో సినిమా మొదటిరోజు రికార్డ్స్ బ్రేక్ చేసింది. కోలీవుడ్, టాలీవుడ్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అని చెప్పవచ్చు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి