Home » Entertainment » Intinti Gruhalakshmi Serial 15 October 2021 Episode
Entertainment

Intinti Gruhalakshmi 15 Oct Today Episode : ప్రేమ్.. శృతిని ప్రేమిస్తున్నాడని జీకేకు చెప్పిన తులసి.. షాక్ అయిన జీకే, అక్షర

Authored By
Varun G
The Telugu News | Updated on: October 15, 2021, 3:29 pm
Advertisement

Intinti Gruhalakshmi 15 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 15 అక్టోబర్, 2021, శుక్రవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎలాగైనా ప్రేమ్, అక్షర పెళ్లి ఆపాలని నిశ్చయించుకున్న తులసి.. వెంటనే ఇంటికి బయలుదేరుతుంది. శృతిని నందు రూమ్ లో బంధించిన విషయం తెలుసుకున్న తులసి ఆటోలో కూర్చొని శృతికి ఫోన్ చేస్తుంది. కానీ.. శృతి ఫోన్ లిఫ్ట్ చేయదు. మరోవైపు ముహూర్తం మించిపోతుంటుంది. కన్యాదానం చేయడానికి పెళ్లికొడుకు, పెళ్లికూతురు తల్లిదండ్రులు రండి అని పూజారి పిలుస్తాడు.

Advertisement

Advertisement

intinti gruhalakshmi serial 15 october 2021 episode

Advertisement


ఇంతలో తులసి కనిపించదు. ఏమైంది నందు గారు.. తులసి ఏది అని అడుగుతాడు జీకే. చూసొస్తా అని చెప్పి వెళ్తాడు నందు. తులసి కనిపించడం లేదు. తులసి ప్లేస్ లో లాస్యను కూర్చోబెడదాం. కార్యక్రమం జరిపించేద్దాం అంటాడు నందు. దీంతో జీకేకు తీవ్రంగా కోపం వస్తుంది. డాడీ అలా వద్దు.. తులసి ఆంటియే రావాలి అని అక్షర కూడా అంటుంది. విన్నారుగా.. తులసి లేకపోతే నా కూతురు ఈ కన్యాదానమే వద్దన్నది. ఆంటీ లేకుంటే జరిగే పెళ్లి పెళ్లే కాదు.. అని అంటుంది అక్షర.

Advertisement


మరోవైపు శృతికి ఎంత ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయదు. తులసి గారిని అసలు ఈ పెళ్లి ఇష్టం ఉందా లేదా.. నాకు తెలియాలి అని జీకే నందును నిలదీస్తాడు. దీంతో బావగారు అలా మాట్లాడుతున్నారు ఏంటి.. అంటాడు. నందు.. నేనీ పెళ్లికి పెట్టిన ఒకే ఒక కండీషన్.. మీరు, తులసి ఇద్దరు కలిసి ఈ పెళ్లి జరిపించాలని చెప్పా కదా అంటాడు జీకే. కానీ.. తులసి గారు ఇక్కడ లేరు.. అని జీకే సీరియస్ అవుతాడు. ఇంతలో నందు తులసికి ఫోన్ చేయడంతో కట్ చేస్తుంది తులసి.

Advertisement


వెంటనే ఇంటికి వెళ్లి.. శృతి.. శృతి అని పిలుస్తుంది తులసి. ఆంటి వచ్చినట్టుంది అని అనుకుంటుంది శృతి. పెళ్లి టైమ్ లో అక్కడ ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అనుకుంటుంది శృతి. ఖచ్చితంగా నా మనసు మార్చడానికే వచ్చి ఉంటారు. పెళ్లి మండపానికి తీసుకెళ్లేందుకే వచ్చి ఉంటారు.. అని అనుకుంటుంది శృతి. దీంతో రూమ్ లో ఉండి.. అస్సలు రెస్పాండ్ కాదు.

Intinti Gruhalakshmi 15 Oct Today Episode : నందు ఫోన్ ను కట్ చేసిన తులసి

మరోవైపు తులసి ఫోన్ కట్ చేస్తుందని నందు.. చెబుతాడు. నువ్వుయినా కాల్ చేయి అని ప్రేమ్ కు చెప్పినా.. ప్రేమ్ కూడా వద్దు అంటాడు. అమ్మ నన్ను అలా మధ్యలో వదిలిపెట్టదు.. తప్పకుండా వస్తుంది అని చెబుతాడు ప్రేమ్.మరోవైపు శృతి రాసిన లెటర్ దొరుకుతుంది తులసికి. అది ప్రేమ్ కోసం రాసుకున్న ప్రేమ లేఖ. ఆ లేఖను చదివి తుసలి మరింత భావోద్వేగానికి గురవుతుంది.


ఇక.. తప్పని పరిస్థితుల్లో జీకేనే తులసికి ఫోన్ చేస్తాడు. అదే సమయంలో శృతికి ఫోన్ చేస్తుంది తులసి. తన ఫోన్ సౌండ్ విని తను ఏ రూమ్ లో ఉందో కనిపెడుతుంది. అంత అరుస్తున్నా నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు. అసలు నీ మనసులో ఏముంది అని అని గట్టిగానే ప్రశ్నిస్తుంది తులసి.

intinti gruhalakshmi serial 15 october 2021 episode


కట్ చేస్తే.. తులసి పెళ్లి మండపం వద్దకు వస్తుంది. జీకే ఏమైందని అడుగుతాడు. ప్రేమ్ శృతిని ప్రేమించాడు అని చెబుతుంది తులసి. దీంతో జీకే షాక్ అవుతాడు. శృతి కూడా ప్రేమ్ ను ప్రేమించింది అని చెబుతుంది. అక్షర కూడా ఈ విషయం వింటుంది. మరి వాళ్లిద్దరు ప్రేమించుకున్నప్పుడు అక్షర పరిస్థితి ఏంటి అని అడుగుతాడు జీకే. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి