Home » Entertainment » Intresting News About Anushka Shetty
Entertainment

Anushka Shetty : అనుష్క ని ‘ అలా ‘ అన్నారు అని తెలిసి పిచ్చ కోపంతో రంగంలోకి దిగిన ప్రభాస్ !

Authored By
aruna
The Telugu News | Published on: July 4, 2023, 3:23 pm
Advertisement

Anushka Shetty : టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలు కావస్తుంది. నాగార్జున నటించిన ‘ సూపర్ ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటన పరంగా కూడా అనుష్క ఎంతో మంచి పేరు సంపాదించుకుంది. అందుకే తన లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసింది. అందులో అరుంధతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక తెలుగులో ప్రభాస్ అనుష్క జోడి కి మంచి క్రేజ్ ఉంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే పడి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు.

Advertisement

ఇప్పటికే ప్రభాస్ అనుష్క కలిసి బిర్లా, మిర్చి, బాహుబలి సినిమాలు చేశారు. ఇవన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయినవే. ఇక చూడడానికి కూడా వీళ్ళిద్దరూ బాగుండడంతో అభిమానులు వీళ్లను ఎంతో లైక్ చేస్తుంటారు. అయితే అనుష్కకి బాలీవుడ్ నుంచి పెద్దపెద్ద అవకాశాలు వచ్చాయి. కానీ అనుష్క ఒక్క కారణంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేయనని చెప్పింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు అలాంటివి ఏమి చేయవద్దు అని తర్వాత విచ్చలవిడిగా హద్దులు మీరే ప్రయత్నం చేయిస్తారని, ఆ కారణంగానే అనుష్క బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లాలనుకోవడం లేదని తెలుస్తుంది.

Intresting news about Anushka Shetty

Advertisement

దీంతో అనుష్క పేరు సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అవుతుంది. ఇక అనుష్క ప్రస్తుతం నవీన్ పోలిశెట్టికి జోడిగా మిస్ శెట్టి మిస్టర్ శెట్టి సినిమాలో నటించింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ సినిమా హిట్ అయితే అనుష్క మళ్ళీ ట్రాక్ లో పడుతుంది. ఇక అనుష్క గురించి ఏ న్యూస్ రాసిన అందులోకి ప్రభాస్ లాగుతూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఏది ఏమైనా టాలీవుడ్ లో ప్రభాస్ అనుష్కల జోడి కి మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో మరొక సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి