Intresting News On Balakrishna
Balakrishna ;టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ సినిమాలు చేస్తూ అభిమానులను ఎంతగానో అలరిస్తున్నారు. ఈ ఏజ్ లో కూడా ఆయన మాస్ సినిమాలు చేస్తున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ‘ వీరసింహారెడ్డి ‘ సినిమాతో యాక్షన్ హీరోగా ఫుల్ మార్క్స్ కొట్టేశాడు. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మాస్ లుక్ తో బాలయ్య అందరిని ఆకట్టుకున్నారు. ఇక త్వరలోనే ‘ భగవంత్ కేసరి ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా బాలకృష్ణ గురించి ప్రముఖ నటుడు అప్పాజీ అంబరీష కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ టాలీవుడ్ నటుడు అప్పాజీ అంబరీష ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలయ్య గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ ‘ ఎన్టీఆర్ కథానాయకుడు ‘ సినిమాలో తాను నటించాను అని, క్లైమాక్స్ లో నా ఎంట్రీ ఉంటుందని, జీవన్ రెడ్డి పాత్ర చేశానని ఆయన అన్నారు. ఎన్టీఆర్ రియల్ లైఫ్ లో నన్నపనేని రాజకుమారి వాళ్లు సీనియర్ ఎన్టీఆర్ ముందు గాజులు పగలగొట్టారని, ఆసీన్ సమయంలో ఎదురైన అనుభవాల గురించి అప్పాజీ అంబరీష కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలయ్య ముందు గాజులు పగలకొట్టి ఉమ్మివేయాలని డైరెక్టర్ చెప్పగా ఆ పాత్ర చేయడానికి నటీమణులు చాలా భయపడ్డారు.
Intresting News On Balakrishna
అయితే బాలయ్య వాళ్లతో మనం జరిగింది చేస్తున్నామని, ఏం ఆలోచించకుండా చేయాలని, నిజంగానే గాజులు పగలగొట్టండని, ఉమ్మినట్టు నటించవద్దని నిజంగానే ఉమ్మివేయాలని బాలయ్య ఆ నటీమణులతో చెప్పారని అప్పాజీ అంబరీష చెప్పారు. బాలయ్య అలా చెప్పడంతో నేను చాలా ఆశ్చర్యపోయాను. బాలయ్యను నన్ను దమ్ముంటే కొట్టరా అని డైరెక్టుగా చేశా మీరు బాగా చేస్తున్నారు అని ఆయన నన్ను ప్రశంసించారు. ఆ సీన్లు ఒరిజినల్ అసెంబ్లీ లో జరిగాయని ఆయన కామెంట్లు చేశారు. బాలయ్య తన చుట్టూ ఉండే వాళ్ళను ఎంతో అభిమానిస్తారని, గౌరవిస్తారని అప్పాజీ అంబరీష పేర్కొన్నారు.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.