Chiranjeevi : యాడ్ కావాలా, నా ఫొటో కావాలా.. లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకిన చిరు
ప్రధానాంశాలు:
Chiranjeevi : యాడ్ కావాలా, నా ఫొటో కావాలా.. లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకిన చిరు
Chiranjeevi : చిరంజీవి నంబర్ 1 గా కొనసాగుతున్న సమయంలో ఆయన ఫోటో ముద్రించుకుని చాలా పత్రికలు లాభాలు పొందాలని చూసేవి. ఈ విషయాన్ని రచయిత తోట ప్రసాద్ బయట పెట్టారు. తాను పనిచేసిన ఒక మ్యాగజైన్ సంస్థ నష్టాల్లో నడుస్తోంది. ఆ టైం లో తమని నష్టాల నుంచి గట్టెక్కించే డీల్ ఒక లిక్కర్ బ్రాండ్ ద్వారా కుదిరింది.

Chiranjeevi : యాడ్ కావాలా, నా ఫొటో కావాలా.. లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకిన చిరు
Chiranjeevi : దటీజ్ చిరు
తమ బ్రాండ్ కి ప్రచారం కల్పిస్తే భారీ మొత్తం ఇస్తామని వాళ్ళు ఆఫర్ చేశారు. ఆఫర్ అయితే వచ్చింది. దానితో పాటు ఎక్కువ కాపీలు అమ్ముడయ్యేలా చేయాలి. అలా చేయాలి అంటే చిరంజీవి ఫోటో కవర్ పేజీపై కనిపించాలి. కింద లిక్కర్ యాడ్ వేశాం. పైన చిరంజీవి ఫోటో ముద్రించాం. ఫైనల్ ఎడిషన్ కంప్లీట్ కాకముందే ఈ విషయం చిరంజీవికి తెలిసింది. చిరంజీవి మమల్ని పిలిపించారు. ఏంటిది అని ప్రశ్నించారు.
ఆ యాడ్ వేరు.. మీ ఫోటో వేరు అని చెప్పాం. అది నాకు అర్థం అవుతుంది. కానీ సామాన్యులు ఎలా అర్థం చేసుకుంటారు ? లిక్కర్ బ్రాండ్ పైనే నా ఫోటో ఉంటే.. ప్రమోట్ చేస్తున్నది నేనే అని అనుకుంటారు. ఇలాంటి వాటికి అస్సలు ఒప్పుకోను. ఆ బ్రాండ్ తో మాకు మంచి డీల్ వచ్చింది సార్ అని చెప్పాం. అయితే నా ఫోటో తీసేయండి అని అన్నారు. లిక్కర్ బ్రాండ్ పక్కన నా ఫోటో ఉండడానికి అసలు ఒప్పుకోను అని తేల్చేశారు. వేస్తె లిక్కర్ బ్రాండ్ ఒక్కటే వేసుకోండి.. లేకుంటే నా ఫోటో ఒక్కటే వేయండి అని చిరంజీవి సీరియస్ వార్నింగ్ ఇచ్చి తన ఫోటో తొలగించారు అని తోట ప్రసాద్ తెలిపారు.