Home » Entertainment » Is Acharya Going To Release By Sankranthi
Entertainment

Acharya : ఆచార్య సంక్రాంతికి రానుందా…ఇది మెగా ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూసే..?

Authored By
vamana sai
The Telugu News | Published on: June 28, 2021, 11:15 am
Advertisement

Acharya : మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పాన్ ఇండియన్ సినిమాగా సైరా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టారు. వీటికి అందరు యంగ్ డైరెక్టర్స్ నే ఎంచుకున్నారు. వాటిలో ప్రస్తుతం తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా 12 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని అది కంప్లీట్ అయితే చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని దర్శకుడు కొరటాల శివ ఇటీవల ప్రకటించాడు.

Advertisement

is acharya-going to release by sankranthi

ఇక ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే చరణ్ – చిరు లుక్స్ రిలీజై మెగా అభిమానులను ఆకట్టుకున్నాయి. చరణ్ కి జంటగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే నీలాంబరి అనే పాత్రలో నటిస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటెర్టైన్మెంట్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై నుండి చిత్రీకరణ మొదలుకానుండగా.. ఆగష్టు లో ఫస్ట్ కాపీ రానున్దట. దాంతో దసరా లేదా దీపావళి కి ఆచార్య చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

Advertisement

Acharya : ఇన్‌సైడ్ టాక్ మాత్రం ఆచార్య 2022లోనే రిలీజ్ అని వినిపిస్తోంది.

అయితే ఇప్పటికే ఈ ఏడాదిలో రిలీజ్ అయ్యే సినిమాలు చాలానే ఉన్నాయి. వాటితో చూసుకుంటే ఆచార్య ఈ ఏడాది వచ్చేది కూడా కాస్త అనుమానమనే అంటున్నారు. పుష్ప పార్ట్ వన్ రిలీజ్ కావాల్సి ఉంది. ప్రభాస్ రాధే శ్యామ్ కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. గని, లైగర్, లవ్ స్టోరి, ఖిలాడి, అఖండ, విరాట పర్వం, నారప్ప, దృశ్యం 2, ఎఫ్ 3.. ఇలా చాలా సినిమాలున్నాయి. మరి వీటిలో ఏది రిలీజ్ అవుతుందో ఏది వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అవుతుందో అనే విషయంలో పెద్ద డైలమా నెలకొంది. ఇన్‌సైడ్ టాక్ మాత్రం ఆచార్య 2022లోనే రిలీజ్ అని వినిపిస్తోంది. ఇక త్వరలో మెగాస్టార్ తమిళ దర్శకుడు మోహన్ రాజాతో లూసీఫర్ రీమేక్ చేయబోతున్నాడు.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి