Ys jagan
Ys Jagan : ‘‘అయినవారికి అరిటాకుల్లో.. కానివారికి కంచాల్లో’’ అనే మాట వినే ఉంటాం. విమర్శించటానికి వినియోగిస్తుంటాం. ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ వైఎస్సార్సీపీలో చాలా మంది సీనియర్ లీడర్లు తమ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా ఇదే మాట అడగాలని మనసులో గట్టిగా అనుకుంటున్నారు. వేరే పార్టీల నుంచి వైఎస్సార్సీపీలోకి వచ్చినవారికి ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుండటం పట్ల వాళ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీనే నమ్ముకొని ఉన్నందుకు, ఎన్నో త్యాగాలు చేసినందుకు ఇదా బహుమానమని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా తమను గుర్తించకపోవటం సరికాదని తప్పుపడుతున్నారు.
Ys Jagan
నియోజకవర్గాలకు నిధులను కేటాయించే విషయంలోనూ సీఎం వైఎస్ జగన్ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపుతున్నారని, ఒకటికి రెండు సార్లు అడిగితే తప్ప ఫండ్స్ రిలీజ్ చేయట్లేదని వైఎస్సార్సీపీ శాసన సభ్యులు వాపోతున్నారు. ఇతర పార్టీల నుంచి జంప్ చేసి వైఎస్సార్సీపీలో జాయిన్ అయిన నాయకులకైతే అడిగిన వెంటనే పనులు చేసి పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. తాము రిఫర్ చేసిన వ్యక్తులకు పదవులు దక్కట్లేదంటూ ఆగ్రహాన్ని వెలిబుచ్చుతున్నారు. సలహాదారులతో సన్నిహితంగా ఉండేవారి మాటలు చెల్లుబాటు అవుతున్నాయని గుర్తుచేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము జనంలో మొహం చూపించలేమని, పబ్లిక్ కూడా రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేయటానికి వెనకాడుతున్నారని తేల్చిచెబుతున్నారు.
వైఎస్సార్సీపీ తరఫున రెండు మూడు సార్లు గెలిచిన శాసన సభ్యులకే సీఎం వైఎస్ జగన్ దగ్గర అపాయింట్మెంట్లు దొరకని పరిస్థితి నెలకొందని పలువురు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ సర్కారులో విపక్ష నేతలకు కూడా నిధులను బాగానే ఇచ్చేవారని, ఇప్పుడు ఆ వాతావరణం లేదని అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కావాలనే ఇలా చేస్తున్నారా? లేక మరేదైనా ఉందా అంటూ మథనపడుతున్నారు. ఎన్నికల్లో తాము బరిలో నిలవాలనుకున్న స్థానాలను సైతం పార్టీ అధినేత ఆదేశానుసారం వదులుకున్నామని, ఇంత చేసినా ఇప్పుడు పట్టించుకునే నాథుడే లేడని తీవ్రంగా బాధపడుతున్నారు.
Ysrcp
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వచ్చిన నాయకులకు వెంటనే ఎమ్మెల్సీ పోస్టులు దక్కుతున్నాయి. డొక్కా మాణిక్య వరప్రసాద్, పోతుల సునీత, పండుల రవీంద్రబాబు, తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ పదవులను కట్టబెట్టడాన్ని వైఎస్సార్సీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము మాత్రం పార్టీ జెండాలను మోసే పార్ట్ టైమ్ కూలీలుగానే మిగిలిపోవాలా అని ప్రశ్నిస్తన్నారు. వైఎస్ జగన్ ని ముఖ్యమంత్రి చేయాలనే పట్టుదలతో ముందుకు సాగినా ఇప్పుడు ఒట్టి చేతులతోనే రోడ్డు మీద నిలబడాల్సిన గతి పట్టిందని ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. వైఎస్సార్సీపీ చీఫ్ వైఎస్ జగన్ ఈ అభిప్రాయాలను ఎప్పుడు పరిగణనలోకి తీసుకుంటారో చూడాలి.
ఇది కూడా చదవండి ==> ఆ పదవికి కసరత్తు పూర్తి… ప్రకటన ఎప్పుడంటే..?
ఇది కూడా చదవండి ==> జగన్ పార్టీలో నివురుగప్పిన నిప్పుల అసమ్మతి.. ఎప్పుడైనా బద్దలైపోవచ్చు
ఇది కూడా చదవండి ==> జగన్ భారీ షాక్ ఇచ్చేదిశగా ఆనం అడుగులు
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
This website uses cookies.