సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా పుష్ప. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ సాగుతోందని సమాచారం. ఇక అల్లు అర్జున్ ఈ సినిమాలో మాస్ క్యారెక్టర్ లో కనింపించడమే కాదు లారీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యం శెట్టి మీడియా నిర్మాణ సంస్థలు సమ్యుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.
ముఖ్యంగా అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కాబట్టి ఎక్కువగా బాలీవుడ్ మీద ఈ సినిమాతో ఫోకస్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టే సుకుమార్ కూడా అల్లు అర్జున్ క్యారెక్టర్ ని యూనివర్సల్ గా డిజైన్ చేశాడట. ఆర్య, ఆర్య 2 లాంటి క్లాస్ సినిమాలతో సూపర్ హిట్ కాంబినేషన్ అయిన సుకుమార్ – అల్లు అర్జున్ కలిసి చేస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమా మీద భారీ అంచనాలున్నాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అల్లు అర్జున్.. రంగస్థలం సినిమా చూసే అలాంటి కథ కావాలని సుక్కూ ని అడిగాడంటే ఈ సినిమా మీద ఎంత ఇంపాక్ట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సినిమా ద్వారా అనసూయ కి రంగమ్మత్త అన్న అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చిన సుకుమార్ విపరీతమైన క్రేజ్ వచ్చేలా చేశాడు.
ఈ క్యారెక్టర్ తర్వాత అనసూయ క్రేజ్ సినిమా ఇండస్ట్రీలో విపరీతంగా పెరిగింది. కాగా తాజాగా సుకుమార్ పుష సినిమా కోసం అనసూయ ని అడగగా నో చెప్పి షాకిచ్చిందని సమాచారం. అందుకు కారణం సుకుమార్ చెప్పిన క్యారెక్టర్ కంప్లీట్ డీ గ్లామర్ రోల్ కావడమే అని టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో సుకుమార్ లేదా అనసూయ స్పందిస్తే గాని తెలియదు. కాగా అనసూయ ప్రస్తుతం క్రియోటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగ మార్తాండ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.