Home » Entertainment » Is Beautyfull Actress Rasikhanna Why Doing Such Things
Entertainment

ఇంత అందంగా ఉండే రాశీఖన్నా అలాంటి పనులు చేస్తానంటే ఎలా ..?

Authored By
vamana sai
The Telugu News | Published on: December 10, 2020, 3:38 pm
Advertisement

ప్రస్తుతం బబ్లీ బ్యూటీ రాశీఖన్నా కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఎంటో అందరికీ తెలిసిందే. రీసెంట్ గా సాయి ధరం తేజ్ తో ప్రతిరోజూ పండగే, నాగ చైతన్య తో వెంకీ మామా సినిమాలలో నటించి వరసగా రెండు హిట్స్ అందుకొని ఫుల్ ఫాం లో ఉంది. కాగా రాశీఖన్నా తాజాగా తెలుగులో ఒక సినిమా కమిటయినట్టు సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారట. ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్స్ లో యంగ్ హీరోస్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ అంటే రాశీ ఖన్నా నే అన్న నమ్మకం చాలా మంది మేకర్స్ లో ఉంది.

Advertisement

ఇక రీసెంట్ గా రాశీ ఖన్నా.. కోలీవుడ్ లో సూపర్ హిట్ సినిమా సీక్వెల్ లో నటించే అవకాశం దక్కించుకుందన్న వార్తలు వస్తున్నాయి. ఇలయదళపతి విజయ్, మురుగదాస్ ల కాంబినేషన్ లో ఒక సినిమా మొదలబోతోందని … ఆ సినిమా తుపాకి సీక్వెల్ ‘తుపాకి 2’ అని సమాచారం. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా రాశీ ఖన్నా ని ఎంచుకున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్ త్వరలోనే రానుందని కోలీవుడ్ మీడియా ద్వారా అందుతున్న సమాచారం.

Advertisement

ఇక రాశీ రీసెంట్ గా తన పర్సనల్ విషయాలని బయట పెట్టింది. వాస్తవంగా తను ఐఏఎస్ అవ్వాలనుకుందట. కాని ఫేట్ ఇలా ఉండటంతో హీరోయిన్ అయ్యాయనని చెప్పుకొచ్చింది. ఇక తమిళంలో రెండు ప్రాజెక్ట్స్ చేయబోతున్న రాశీఖన్నా కి రాజకీయాలలోకి రావాలని ఉన్నట్టు తెలిపింది. ఇప్పుడు రాశీ ఖన్నా కెరీర్ హీరోయిన్ గా చాలా బాగా సాగుతోంది. ఇలాంటి సమయంలో రాజకీయాలలోకి వెళ్ళాలని ఉందన్న విషయం కొంతమంది ఫ్యాన్స్ కి మింగుడు పడటం లేదట. ఇంత బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అయిన మీరు సినిమాలు వదిలేసి రాజకీయాలలోకి వెళ్ళడం ఏం బాగాలేదని కామెంట్ చేస్తున్నారట. అయితే రాశీఖన్నా రాజకీయాలలోకి వెళితే సినిమాలు మానేస్తానని మాత్రం వెల్లడించలేదు. చూడాలి మరి ఏం చేస్తుందో.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి