ఇంత అందంగా ఉండే రాశీఖన్నా అలాంటి పనులు చేస్తానంటే ఎలా ..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

ఇంత అందంగా ఉండే రాశీఖన్నా అలాంటి పనులు చేస్తానంటే ఎలా ..?

ప్రస్తుతం బబ్లీ బ్యూటీ రాశీఖన్నా కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఎంటో అందరికీ తెలిసిందే. రీసెంట్ గా సాయి ధరం తేజ్ తో ప్రతిరోజూ పండగే, నాగ చైతన్య తో వెంకీ మామా సినిమాలలో నటించి వరసగా రెండు హిట్స్ అందుకొని ఫుల్ ఫాం లో ఉంది. కాగా రాశీఖన్నా తాజాగా తెలుగులో ఒక సినిమా కమిటయినట్టు సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారట. ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్స్ […]

 Authored By govind | The Telugu News | Updated on :10 December 2020,3:38 pm

ప్రస్తుతం బబ్లీ బ్యూటీ రాశీఖన్నా కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఎంటో అందరికీ తెలిసిందే. రీసెంట్ గా సాయి ధరం తేజ్ తో ప్రతిరోజూ పండగే, నాగ చైతన్య తో వెంకీ మామా సినిమాలలో నటించి వరసగా రెండు హిట్స్ అందుకొని ఫుల్ ఫాం లో ఉంది. కాగా రాశీఖన్నా తాజాగా తెలుగులో ఒక సినిమా కమిటయినట్టు సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారట. ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్స్ లో యంగ్ హీరోస్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ అంటే రాశీ ఖన్నా నే అన్న నమ్మకం చాలా మంది మేకర్స్ లో ఉంది.

Prati Roju Pandage movie 3 days box office collection report

ఇక రీసెంట్ గా రాశీ ఖన్నా.. కోలీవుడ్ లో సూపర్ హిట్ సినిమా సీక్వెల్ లో నటించే అవకాశం దక్కించుకుందన్న వార్తలు వస్తున్నాయి. ఇలయదళపతి విజయ్, మురుగదాస్ ల కాంబినేషన్ లో ఒక సినిమా మొదలబోతోందని … ఆ సినిమా తుపాకి సీక్వెల్ ‘తుపాకి 2’ అని సమాచారం. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా రాశీ ఖన్నా ని ఎంచుకున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్ త్వరలోనే రానుందని కోలీవుడ్ మీడియా ద్వారా అందుతున్న సమాచారం.

ఇక రాశీ రీసెంట్ గా తన పర్సనల్ విషయాలని బయట పెట్టింది. వాస్తవంగా తను ఐఏఎస్ అవ్వాలనుకుందట. కాని ఫేట్ ఇలా ఉండటంతో హీరోయిన్ అయ్యాయనని చెప్పుకొచ్చింది. ఇక తమిళంలో రెండు ప్రాజెక్ట్స్ చేయబోతున్న రాశీఖన్నా కి రాజకీయాలలోకి రావాలని ఉన్నట్టు తెలిపింది. ఇప్పుడు రాశీ ఖన్నా కెరీర్ హీరోయిన్ గా చాలా బాగా సాగుతోంది. ఇలాంటి సమయంలో రాజకీయాలలోకి వెళ్ళాలని ఉందన్న విషయం కొంతమంది ఫ్యాన్స్ కి మింగుడు పడటం లేదట. ఇంత బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అయిన మీరు సినిమాలు వదిలేసి రాజకీయాలలోకి వెళ్ళడం ఏం బాగాలేదని కామెంట్ చేస్తున్నారట. అయితే రాశీఖన్నా రాజకీయాలలోకి వెళితే సినిమాలు మానేస్తానని మాత్రం వెల్లడించలేదు. చూడాలి మరి ఏం చేస్తుందో.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది