Home » Entertainment » Is Bigg Boss Shiva Jyothi Preganant Latest Pics Viral
Entertainment

Shiva Jyothi : గర్భం దాల్చిన బిగ్ బాస్ శివ జ్యోతి?.. నెటిజన్ల కామెంట్లు ఇవే..!

Authored By
aruna
The Telugu News | Published on: August 29, 2023, 1:00 pm
Advertisement

Shiva Jyothi : బిగ్ బాస్ షోలో శివ జ్యోతి చేసిన రచ్చ ఎప్పటికీ ఎవ్వరూ మరిచిపోలేరు. పాతాళా గంగలా ఆమె ఏడుపులు పెడబొబ్బులు ఇప్పటికీ రీ సౌండ్‌లో వినిపిస్తుంటాయి. వారం వారం ఎలిమినేషన్ జరగడం, ఎవరు బయటకు పోయినా కూడా శివ జ్యోతి కన్నీరుమున్నీరు అవ్వడం పరిపాటిగా వస్తూనే ఉండేది. అలా శివ జ్యోతికి పాతాళ గంగా అనే పేరు ఫిక్స్ అయింది. ఇక ఏడ్వకు తల్లి.. మహా నగరం మునిగిపోయేలా ఉందంటూ నాగార్జున చేతులెత్తి దండం పెట్టేశాడు.

Advertisement

అలా న్యూస్ రీడర్ తీన్మార్ సావిత్రి కాస్త.. శివ జ్యోతిగా తన కంటూ గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన సావిత్రికి టీవీలో ఆఫర్లు బాగానే వచ్చాయి. టీవీ 9 న్యూస్ రీడర్‌గా చేస్తూనే బుల్లితెరపై ఇతర వినోదాత్మక కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. మధ్యలో శివ జ్యోతి అందాల ప్రదర్శన కాస్త హద్దులు దాటింది. పొట్టి బట్టలు వేసుకోవడం మొదలుపెట్టేసింది. దాని మీద విపరీతమైన ట్రోలింగ్ నడిచింది.

Bigg Boss Shiva Jyothi Preganant Latest Pics Viral

Advertisement

బిగ్ బాస్ ఇంటి నుంచి వచ్చిన శివ జ్యోతి యూట్యూబ్ చానెల్ పెట్టి బాగానే సంపాదించింది. ఇళ్లు, కారు కొనేసింది. గతంలో ఓ సారి శివజ్యోతి ప్రెగ్నెంట్ అంటూ రూమర్లు వచ్చాయి. వాటిని ఖండించిన శివ జ్యోతి. తాజాగా మళ్లీ అలాంటి వార్తలే వస్తున్నాయి. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో షూట్ చూస్తుంటే గర్భం దాల్చినట్టుగానేకనిపిస్తోంది. త్వరలోనే తల్లి కాబోతోన్నట్టుగా అనిపిస్తోంది. అక్కా.. నువ్వు ప్రెగ్నెంట్‌వా? అని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి దీనిపై శివ జ్యోతి క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి