pushpa పుష్ప సినిమా బడ్జెట్ లో ఆ ఇద్దరి రెమ్యూనరేషన్ సగం ఉందా ..?

Authored By vamana sai | The Telugu News | Published on: January 22, 2021, 10:15 pm

pushpa  పుష్ప సినిమా బడ్జెట్ గురించి ఇంతకాలం ఎవరూ మాట్లాడుకోలేదు. పాన్ ఇండియన్ సినిమా.. 5 భాషల్లో రిలీజ్ కాబోతుంది. రష్మిక మందన్న హీరోయిన్. సుకుమార్ దర్శకుడు. సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప హ్యాట్రిక్ సినిమా అన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తో సుకుమార్ ఆర్య.. ఆర్య 2 లాంటి క్లాస్ సినిమాలని తీసి స్టైలిష్ స్టార్ అన్న ఇమేజ్ వచ్చేలా చేశాడు. కాని పుష్ప సినిమా మాత్రం అందుకు భిన్నంగా తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ ని ఇప్పటి వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా సుకుమార్ చూపిస్తున్నాడు.

అంతేకాదు కథ కూడా యూనివర్సల్ ఎలిమిమెంట్స్ ఉన్న కథ. ఇక పుష్ప సినిమా తో ముఖ్యంగా అల్లు అర్జున్ .. సుకుమార్ బాలీవుడ్ లో సత్తా చాటాలని తాపత్రయపడుతున్నారు. అందుకే సుకుమార్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తుంటే అల్లు అర్జున్ ఎన్ని టేకులు కావాలన్నా ఓపికతో చేస్తున్నాడట. మాసీవ్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ లుక్ ఇప్పటికే హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో పుష్ప సినిమా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందుస్తున్నాడు.

సుకుమార్ – అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ..?

కాగా ఇంతకాలం పుష్ప సినిమా బడ్జెట్ టాపిక్ రానిది తాజాగా ఈ సినిమా బడ్జెట్ గురించి ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి అంటున్నారు. అయితే పుష్ప సినిమా బడ్జెట్ 100 నుంచి 120 కోట్లు ఉంటుందని అందరు భావించారట. కాని ఇపుడు అసలు బడ్జెట్ తెలిసి షాకవుతున్నారట. సుకుమార్ రెమ్యూనరేషన్ తో పాటు అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ తో కలిపి 180 కోట్లు వరకు కేటాయించారని తాజా సమాచారం. అయితే సినిమా ఫస్ట్ కాపీ వచ్చే వరకు ఈ బడ్జెట్ మరింత పెరిగే అవకాశం కూడా ఉందట. అయితే లాభాలలో వాటా కూడా కలుపుకొని సుకుమార్ – అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ కే 80 నుంచి 100 కోట్లు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే మొత్తంగా 200 కోట్ల వరకు అవుతుందన్న టాక్ వినిపిస్తోది. ఏదేమైనా పుష్ప సినిమాకి ఇంత బడ్జెట్ అంటే తప్పదు మరి. అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా.

vamana sai

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp