
Aacharya , చిరంజీవి లైనప్ చేసిన సినిమాలలో ప్రస్తుతం ఆచార్య సెట్స్ మీద ఉంది. త్వరలో ఆచార్య సినిమాని కంప్లీట్ చేయనున్నారు. రాం చరణ్ – నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా నిర్మిస్తున్న ఆచార్య సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రాం చరణ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సమ్మర్ కి రిలీజ్ కాబోతోంది. ఇక ఈ నెల 26 న ఆచార్య సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ టీజర్ కి మణిశర్మ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నట్టు సమాచారం.
ఈ క్రమంలో చిరంజీవి నెక్స్ట్ సినిమాని సెట్స్ మీదకి తీసుకురాబోతున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి నెల నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాలోని ప్రధాన తారాగణం ఎంపిక జరుగుతోందట. త్వరలో హీరోయిన్ సహా ఇతర పాత్రలకి సంబంధించిన నటులను ప్రకటించబోతున్నారని సమాచారం. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ఎంపికయ్యాడు. ఫస్ట్ టైం థమన్ .. చిరంజీవి సినిమాకి సంగీతం అందిస్తుండటం తో అద్భుతమైన ట్యూన్స్ రెడీ చేస్తున్నాడని తెలుస్తోంది.
కాగా చిరంజీవి లైనప్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒక ప్రాజెక్ట్ నుంచి డ్రాపయ్యే అవకాశాలున్నాయని న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ప్రాజెక్ట్ తమిళంలో అజిత్ కుమార్ నటించగా సూపర్ హిట్ గా నిలిచిన వేదాలం తెలుగు రీమేక్. ఈపాటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్దం అయిందని మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడని వార్తలు వచ్చాయి. సమ్మర్ తర్వాత ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేలా సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. అంతేకాదు ఈ సినిమా విషయంలో చిరంజీవి కూడా స్వయంగా వెల్లడించారు. మరి ఇప్పుడు ఈ న్యూస్ ఎందుకు వచ్చిందన్నది మేకర్స్ క్లారిటీ ఇస్తేనే నమ్మడానికి లేదు.
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్‌కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
This website uses cookies.