Jabardasth Faima : ఫైమా మళ్లీ జబర్దస్త్‌ లోకి వచ్చే ఛాన్స్ ఉందా.. ఆమె ప్రస్తుత పరిస్థితి ఏంటీ?

 Authored By prabhas | The Telugu News | Updated on :8 January 2023,10:00 am

Jabardasth Faima : ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన పటాస్ కార్యక్రమం తో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఫైమా ఆ తర్వాత జబర్దస్త్ లో ఏ స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకుందాం అందరికి తెలిసిందే. పెద్ద హీరోల అటెన్షన్ ని కూడా దక్కించుకున్న ఫైమా అనూహ్యంగా బిగ్ బాస్ సీజన్ 6 లో సందడి చేసిన విషయం కూడా తెలిసిందే. జబర్దస్త్ కార్యక్రమంలో మంచి ఫేమ్ ఉన్న సమయం లో బిగ్బాస్ కి వెళ్లడం చాలా పెద్ద తప్పు అంటూ కొందరు ఆమెను హెచ్చరించినా కూడా వినకుండా అక్కడికి వెళ్ళింది. ఫైనల్ వరకి ఖచ్చితంగా ఉంటానని భావించింది.. భారీ మొత్తంలో డబ్బు వస్తుందని ఆశించింది. కానీ ఫైనల్ వరకు వెళ్లలేదు.. ఆశించిన డబ్బు కూడా రాలేదు.

ఇప్పుడు జబర్దస్త్ కార్యక్రమంలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఫైమా ప్రయత్నాలు చేస్తుంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజం కాదని సాధారణంగానే ఏడాది కాలం పాటు స్టార్ మా లో కాకుండా మరే కార్యక్రమంలో కూడా ఆమె మాత్రమే కాకుండా ఇతర కంటెస్టెంట్స్ పాల్గొనే అవకాశం లేదని బుల్లి తెర వర్గాల వారు చెప్తున్నారు. బిగ్ బాస్ కార్యక్రమంలో ఒకసారి పాల్గొన్న తర్వాత జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు దాదాపు లేనట్లే. కనుక ఫైమా తిరిగి జబర్దస్త్ కార్యక్రమానికి వస్తుందా అంటే లేదనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది.

is faima re entry in jabardasth comedy show

is faima re entry in jabardasth comedy show

అయితే ఆమె ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న ఒక డ్యాన్స్ షోలో పాల్గొంటుంది. ఆ డాన్స్ షో చేసినందుకు గాను ఆమెకు మంచి రెమ్యూనరేషన్ దక్కుతున్నట్లు తెలుస్తోంది, ఆ డాన్స్ షో తర్వాత స్టార్ మా వారు ఒక కామెడీ షో ప్రారంభించే అవకాశం ఉంది. ఆ కామెడీ షో లో కూడా ఫైమా సందడి చేస్తుందని బుల్లి తెర వర్గాల వారు ఆశిస్తున్నారు. మరో వైపు వెండి తెరపై కూడా ఫైమా కి చాన్స్ లు వస్తున్నాయట. మొత్తానికి ఫైమా ప్రస్తుత కెరియర్ విషయంలో ఆమె సన్నిహితులు మరియు అభిమానులు సంతృప్తిగానే ఉన్నారు. అయితే జబర్దస్త్ కి ఆమె దూరంగా ఉండడం పట్ల కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి