Harihara veeramallu
Harihara veeramallu : హరిహర వీరమల్లు .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. క్రియేటివ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ హరిహర వీరమల్లు సినిమా మీద భారీ స్థాయిలో అంచనాలు పెంచారు.
పవన్ కళ్యాణ్ కెరీర్లో మొదటిసారి చేస్తున్న పీరియాడికల్ సినిమా కావడంతో అందరిలోనూ అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇక ఈ సినిమాని 17వ శతాబ్ధం మొఘలాయిల కాలం నాటి నేపథ్యంలో తెరకెక్కుతుండగా నిధి అగర్వాల్ జాక్విలిన్ ఫెర్నాండస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 2022 సంక్రాతికి భారీ స్థాయిలో తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతోంది. కాగా తాజా కొత్త టాక్ మొదలైంది. హరిహర వీరమల్లు ఫస్ట్ గ్లింప్స్ తో విపరీతమైన క్రేజ్ వచ్చిన కారణంగా ఇప్పుడు వకీల్ సాబ్ మీద భారీగా అంచనాలు పెరిగాయట.
Harihara veeramallu
నిన్నా మొన్నటి వరకు వకీల్ సాబ్ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ ఇప్పటికే రెండు భాషల్లో చూసిన కథ కావడంతో కాస్త టాక్ అటు ఇటుగా ఉన్న మాట వాస్తవమే. కాని ఇప్పుడు ఆ టాక్ పూర్తిగా మారిపోయినట్టు చెప్పుకుంటున్నారు. వకీల్ సాబ్ కథలో మార్పులు సినిమాకి బాగా ప్లస్ అవబోతున్నాయన్న పాజిటివ్ టాక్ మొదలై వకీల్ సాబ్ మంచి అంచనాలు నెలకొంటున్నాయి. ఇక ఈ సినిమా ఏప్రిల్ 9న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. వేణు శ్రీరాం దర్శకత్వం వహించాడు. మొత్తానికి హరిహర వీరమల్లు.. వకీల్ సాబ్ మీద భారీగా అంచనాలు పెంచిందని చెప్పుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.