Pooja Hegde : ప్రస్తుతం ఓ రేంజ్‌లో వెలుగుతున్న హీరోయిన్స్‌లో పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే ఒకరు. కన్నడ భామ అయినప్పటికీ టాలీవుడ్, బాలీవుడ్‌లోనే ఎక్కువగా అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతోంది. అయితే, ఎందుకనో అమ్మడు కెరీర్ గ్రాఫ్ హై రేంజ్‌కు పెరగడం లేదు. కెరీర్ ముందు నుంచి ఇదే పద్ధతిన సాగుతోంది. హీరోయిన్‌గా సినిమాలు చేసిన పూజా మొదట్లో నిలదొక్కుకోవడానికి చాలా సమయమే పట్టింది. తమిళంలో హీరోయిన్‌గా చేసిన మొదటి సినిమా ఫ్లాప్. ఆ తర్వాత తెలుగులో చేసిన మొదటి సినిమా మాత్రమే కాకుండా ఆ తర్వాత సినిమాలు ఫ్లాపే.
ఇక హిందీలో తన డ్రీం అయిన హృతిక్ రోషన్ సరసన నటించిన మొదటి సినిమా మొహంజాదారో కూడా ఫ్లాపే. ఇలా పూజా కెరీర్ ఫ్లాపులతోనే మొదలైనప్పటికీ తెలుగులో మహర్షి, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి 4 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. దాంతో ఏకంగా టాలీవుడ్ బాలీవుడ్‌లలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. హిందీ, తెలుగు సినిమాలలో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంది. కానీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తర్వాత పూజా చేసిన పాన్ ఇండియన్ సినిమాలు రాధే శ్యామ్, బీస్ట్ అట్టర్ ఫ్లాప్‌గా మిగిలాయి.
అంతేకాదు మెగా మల్టీస్టారర్‌గా వచ్చిన ఆచార్య కూడా డిజాస్టర్‌గా మిగిలింది. దాంతో పూజా పరిస్థితి ఏంటీ అనే కామెంట్స్ మొదలయ్యాయి. వాస్తవంగా అమ్మడు బాలీవుడ్ మీద బాగా ఫోకస్ పెట్టింది. అందుకే ఏడాది క్రితం టాలీవుడ్ ప్రేక్షకుల మీద మేకర్స్ మీద కామెంట్స్ చేసింది. కానీ, ఇప్పుడు యూ టర్న్ తీసుకొని బాలీవుడ్‌లో హీరోయిన్‌కు అంతగా ప్రాధాన్యం ఉండే పాత్రలు దక్కడం చాలా కష్టమని ..తెలుగులోనే హీరోయిన్స్‌కు బలమైన పాత్రలు దక్కుతాయని ఇటీవల ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దాంతో యూ టర్న్ తీసుకొని పూజా ఇలా బాలీవుడ్ పై కామెంట్స్ చేస్తుందంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, ఎలాగైనా ఇక్కడ క్రేజ్ పోకుండా అవకాశాలు దక్కించుకునేందుకే ఇలా మాట్లాడిందనే మాటలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి పూజా కొత్త చిత్రాలతో హిట్ అందుకొని మళ్ళీ ఫాంలోకి వస్తుందేమో.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.