Home » Entertainment » Is Rashmika Mandanna Taking A Wrong Step
Entertainment

Rashmika Mandanna : ఇలాంటి సమయంలో రష్మిక మందన్న రాంగ్ స్టెప్ ఎందుకు వేస్తోంది..?

Authored By
vamana sai
The Telugu News | Published on: May 5, 2022, 10:00 pm
Advertisement

Rashmika Mandanna : ప్రస్తుతం కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఉన్నంత బిజీగా మరో హీరోయిన్ లేదనే చెప్పాలి. ఇటు తెలుగులో భారీ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూనే అటు బాలీవుడ్‌లో నాలుగు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తోంది. అలాగే, తమిళంలో కూడా రష్మిక రఫ్ఫాడిస్తోంది. ఇలా అమ్మడు హైదరాబాద్ టు ముంబై వయా చెన్నై అనేలా ఎక్కే ఫ్లైట్, దిగే ఫ్లైట్ల లెక్కే తెలియడం లేదు. ఇప్పటికే రష్మిక హిందీలో నటించిన మిషన్ మజ్ఞు, గుడ్ బై చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో రెండు సినిమాలను కమిటైంది. వాటిలో ఒకటి రణ్‌బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న యానిమల్ సినిమా. దీనికి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement

ఇక తెలుగులో పుష్ప సీక్వెల్ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ పార్ట్ 1తో అమ్మడికి పాన్ ఇండియియన్ రేంజ్‌లో సౌత్‌లోని అన్నీ భాషలతో పాటుగా బాలీవుడ్‌లోనూ వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. పుష్ప మొదటి భాగంతో రష్మిక సంపాదించుకున్న పాన్ ఇండియా క్రేజ్ ఇప్పుడు వరుసగా ప్రాజెక్ట్స్‌ను తెచ్చి చేతిలో పెడుతుంది. ఇటీవల తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న తన 66వ సినిమాలో రష్మికను హీరోయిన్‌గా ఎంచుకున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రముఖ ఇర్మాత దిల్ రాజు పాన్ ఇండియన్ సినిమాగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అమ్మడికి తమిళంలో కూడా భారీ క్రేజ్ దక్కడం ఖాయంటున్నారు.

is rashmika-mandanna taking a wrong step

Advertisement

Rashmika Mandanna: రష్మిక హీరోయిన్ కాదట…!

ఇంత సాలీడ్ ప్రాజెక్ట్స్ చేస్తూ కూల్ గా సాగుతున్న రష్మిక సినీ కెరీర్‌లో అనవసరంగా ప్రయోగాలు చేసి కష్టాలు కొని తెచ్చుకుంటుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. దీనికి కారణం సీతారామం అనే సినిమా. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో స్వప్న సినిమా ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే, ఈ సినిమాలో రష్మికది హీరోయిన్ పాత్ర కాదని స్వయంగా దర్శకుడే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కేవలం కళ్ళతోనే, హావా భావాలు పలికించే పాత్ర అని రష్మిక హీరోయిన్ కాదని…ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్ అయినా కూడా డైలాగులు చాలా తక్కువగా ఉంటాయని చెప్పాడు. దాంతో ఇలాంటి సమయంలో సీతారామం లాంటి సినిమా చేసి కెరీర్ ఎందుకు డిస్టర్బ్ చేసుకుంటావని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి