Rasikhanna : రాశీఖన్నా ఆ హీరో రొమాన్స్‌కి రెడీ అయిందా..?

Authored By vamana sai | The Telugu News | Published on: April 3, 2021, 9:12 am

Rasikhanna : రాశీఖన్నా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. ఈ మధ్య కోలీవుడ్ లో కూడా దాదాపు అరడజను సినిమాలకి సైన్ చేసి అక్కడ స్టార్ హీరోయిన్ లిస్ట్ లో చేరబోతోంది. మారుతి దర్శకత్వంలో సాయి ధరం తేజ్ హీరోగా వచ్చిన ప్రతీ రోజూ పండుగే సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. కానీ ఈ సినిమా తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో ఎందుకనో ఈ అందాల రాశి కి అవకాశాలు రాలేదు. కోలీవుడ్ సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నప్పటికీ ఆమె దృష్ఠి మొత్తం టాలీవుడ్ మీదే ఉందని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

is rasikhanna-ready to romance with that hero...

is rasikhanna-ready to romance with that hero…

అయితే మళ్ళీ మారుతినే రాశీకి అవకాశం ఇచ్చాడని ఆమధ్య వార్తలు వచ్చాయి. గోపీచంద్ – మారుతి కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ అన్న సినిమా మొదలైంది. ఈ సినిమాలో రాశీఖన్నాని హీరోయిన్ గా తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అధికారకంగా మాత్రం వెల్లడి కాలేదు. మరికొన్ని సినిమాలకి టాలీవుడ్ లో రాశీ ఖన్నా పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. కాగా తాజాగా నాగచైతన్యతో దర్శకుడు విక్రమ్ కుమార్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. థాంక్యూ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.

Rasikhanna : నాగ చైతన్య తో కలిసి రాశీ వెంకీ మామ సినిమా చేసి హిట్ కొట్టింది..!

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని సమాచారం. ఇప్పటికే గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంక అరుల్ మోహన్ ఒక హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. కాగా ఒకరు మాత్రం స్టార్ హీరోయిన్ కావాల్సి ఉండగా పూజా హెగ్డే, రష్మిక మందన్నల పేరు ప్రచారం లో ఉంది. ఈ క్రమంలో మరో హీరోయిన్ గా అందాల రాశీఖన్నాకి అవకాశం దక్కినట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య తో కలిసి రాశీ వెంకీ మామ సినిమాచేసి హిట్ కొట్టింది. మళ్ళీ నాగ చైతన్య తో అంటే మంచి అవకాశం అని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో. కాగా ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు.

vamana sai

No bio available for this author.

  1. "Bigg Boss Telugu 10 : టాప్ కంటెస్టెంట్లకు షాక్.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరికి?"

  2. "AP Telangana Weather Alert : తీరం దాటిన మురసు తుఫాన్‌.. ఏపీ, తెలంగాణలో ఈరోజు భారీ వర్షాలు!"

  3. "AP Municipal Election Results : ఏపీలో కూటమి ప్రభంజనం.. పులివెందులలోనూ వైసీపీకి షాక్!"

  4. "Superstar Krishna Remuneration : సూపర్ స్టార్ కృష్ణ తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.? విజయనిర్మల చెప్పిన ఆసక్తికర విషయాలు!"

  5. "US Midterm Elections 2026 : అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే మనకు లాభమా? నష్టమా?"

  6. "Chandrababu : డిసెంబరులో ఏపీ కేబినెట్‌లో మార్పులు? పల్నాడు, రాయలసీమ కు కొత్త మంత్రులు!"

  7. "Home Loan Tips : బ్యాంకులు చెప్పని సీక్రెట్‌.. 20 ఏళ్ల హోమ్ లోన్‌ను త్వరగా తీర్చాలా? ఈ 5 స్మార్ట్ EMI పద్ధతులు పాటించండి..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp