Samantha : స‌ద్గురు చూపించిన అబ్బాయిని స‌మంత పెళ్లి చేసుకోబోతుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : స‌ద్గురు చూపించిన అబ్బాయిని స‌మంత పెళ్లి చేసుకోబోతుందా?

Samantha : మాజీ అక్కినేని కోడ‌లు స‌మంత త్వ‌ర‌లో రెండో పెళ్లి చేసుకోబోతుందా.. అంటే అవున‌నే అంటున్నాయి ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాలు. నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత సోష‌ల్ మీడియా ద్వారా త‌న‌పై వచ్చే విమ‌ర్శ‌ల‌న్నింటిని తిప్పి కొట్టిన స‌మంత ఇప్పుడు చాలా సైలెంట్ అయింది. కొన్నాళ్లుగా సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెట్ట‌డం లేదు. దీంతో ఆమెకు ఏం జ‌రిగిందా అని అందరు ఆరాలు తీస్తుండ‌గా, ఇప్పుడు ఆమె రెండో పెళ్లికి సంబంధించి వార్త‌లు వ‌స్తున్నాయి. […]

 Authored By sandeep | The Telugu News | Updated on :20 September 2022,1:00 pm

Samantha : మాజీ అక్కినేని కోడ‌లు స‌మంత త్వ‌ర‌లో రెండో పెళ్లి చేసుకోబోతుందా.. అంటే అవున‌నే అంటున్నాయి ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాలు. నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత సోష‌ల్ మీడియా ద్వారా త‌న‌పై వచ్చే విమ‌ర్శ‌ల‌న్నింటిని తిప్పి కొట్టిన స‌మంత ఇప్పుడు చాలా సైలెంట్ అయింది. కొన్నాళ్లుగా సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెట్ట‌డం లేదు. దీంతో ఆమెకు ఏం జ‌రిగిందా అని అందరు ఆరాలు తీస్తుండ‌గా, ఇప్పుడు ఆమె రెండో పెళ్లికి సంబంధించి వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ పెళ్ళిని ఫేమస్ స్పిరుచ్యూవల్ గురు సద్గురు బాబా దగ్గరుండి చేయబోతున్నారట…? ఈ వార్తల్లో నిజమెంతో కాని.. పుకారు మాత్రం గట్టిగా షికారు చేస్తోంది. సద్గురుతో సమంతకు మంచి అనుబంధం ఉంది. మొదటి నుంచి మానసికంగా ఇబ్బంది ఉంటే..? సద్గురు ప్రవచనాలు విన‌డం సమంతకు బాగా అలవాటు.

Samantha : నిజ‌మెంత‌?

ఆయ‌న చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌లో కూడా స‌మంత పాల్గొంటూ ఉంటుంది.చైతూ నుండి విడిపోయిన త‌ర్వాత స‌ద్గురు స‌ల‌హాలు పాటిస్తూ డిప్రెష‌న్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చింది.ఇక ఇప్పుడు ఆయ‌న సూచించిన వ్య‌క్తితో పెళ్లి పీట‌లెక్కేందుకు కూడా సిద్ధ‌మైన‌ట్టు టాక్. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది చూడాలి.ఇక స‌మంత ఏమాయ చేశావే మూవీ షూటింగ్ స‌మ‌యంలో చైతూతో ప్రేమ‌లో ప‌డగా, 2017లో అతడిని పెళ్లి చేసుకుంది. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 2న విడాకులు ఇచ్చింది. ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా స‌మంత దూసుకుపోతోంది. కెరీర్ పీక్స్ లో ఉండగానే అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడిన ఈ బ్యూటీ.. నాలుగేళ్ళ పాటు కాపురం చేసి ఆ బంధాన్ని బ్రేక్ చేసుకుంది. దీంతో అప్పటినుంచి సమంత పలు ఇష్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Is Samantha Marrying That Guy Who Shown By Sadhguru

Is Samantha Marrying That Guy Who Shown By Sadhguru

ఇటీవలే స‌మంత తండ్రి జోసెఫ్ ప్ర‌భు.. నాగ చైత‌న్య‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో మరో ఇష్యూ తెరపైకి వచ్చింది. చాలా కాలం క్రితం ఒక క‌థ ఉండేది. ఆ క‌థ ఇక‌పై ఉండ‌క‌పోవ‌చ్చు. కొత్త క‌థ‌ను, కొత్త అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం అన్నాడు జోసెఫ్. దీంతో మళ్ళీ చై సామ్ కలుస్తారా? అనే టాక్ మొదలైంది. ఈ టాక్ న‌డుస్తున్న స‌మ‌యంలోనే స‌మంత రెండో పెళ్లికి సంబంధించి వార్త‌లు వ‌స్తున్నాయి. కొద్ది రోజుల క్రితం నాగ చైత‌న్య ప్రేమ‌తో పాటు రెండో పెళ్లికి సంబంధించి కూడా వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టిన విష‌యం తెలిసిందే.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది