Chiranjeevi : చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యి ఉంటె బాగుండేది .. ఈ మాట అన్నది ఎవరో కాదు !
Chiranjeevi : ఏపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చింతామణి లేటెస్ట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతూ రాష్ట్రంలో మళ్లీ జగన్ అధికారంలోకి రాలేడని అన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండున్నర ఏళ్లు కాపులకు, మిగిలిన రెండున్నర ఏళ్లు ఏళ్లు ఓబిసి, ఎస్సీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో మంగళవారం చింతామణి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు సామాజిక వర్గాలు 75 ఏళ్లుగా దోచుకుంటున్నాయని ఆరోపణలు చేశారు. గతంలో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా చిరంజీవి సీఎంగా ఉంటే బాగుండేది అని చింతామోహన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అప్పట్లో సమీకరణాలు రాజకీయాలు తెలియక చిరంజీవి సీఎం కాలేకపోయారని వ్యాఖ్యానించారు. చిరంజీవి తనకు మంచి మిత్రుడు అని పేర్కొన్నారు. 2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చింతామోహన్ జోష్యం చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. కచ్చితంగా వచ్చే ఎన్నికలలో 120 స్థానాలకు తక్కువ కాకుండా కాంగ్రెస్ గెలుస్తుందని చింతామోహన్ స్పష్టం చేయడం జరిగింది. B ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించేది లేదని తేల్చి చెప్పారు. నిత్యం సిబిఐ కేసులతో రాష్ట్రంలో రచ్చ కొనసాగుతుంది జగన్ మళ్ళీ అధికారంలోకి రాలేరు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిరంజీవిలా అయోమయంలో పడిపోయారు అంటూ చింతామణి కీలక వ్యాఖ్యలు చేశారు.