Nookaraju – Asiya : జబర్దస్త్‌ నూకరాజు ఆసియా లవ్ స్టోరీ.. ఇద్దరి వ్యవహారం ఎంత వరకు నిజం? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nookaraju – Asiya : జబర్దస్త్‌ నూకరాజు ఆసియా లవ్ స్టోరీ.. ఇద్దరి వ్యవహారం ఎంత వరకు నిజం?

 Authored By prabhas | The Telugu News | Updated on :8 October 2022,11:30 am

Nookaraju – Asia : జబర్దస్త్ ఇంత పాపులారిటీ సొంతం చేసుకోవడానికి కారణం సుడిగాలి సుదీర్ మరియు రష్మీ గౌతమ్ మధ్య కెమిస్ట్రీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారిద్దరి మధ్య ప్రేమ అనేది లేదు, అయినా కూడా ఇద్దరికీ జోడి సరిగ్గా కుదిరింది. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు జబర్దస్త్ నిర్వాహకులు పదే పదే వారిద్దరి మధ్య ఏదో ఉంది అన్నట్లుగా సందర్భాన్ని క్రియేట్ చేసి మరీ కెమిస్ట్రీ పండించిన సందర్భాలు చాలా ఉన్నాయి. జబర్దస్త్ సక్సెస్ లో కీలకమైన ఆ లవ్‌ కెమిస్ట్రీ చాలా మంది పై వర్కౌట్ చేసేందుకు మల్లెమాల క్రియేటివ్‌ టీం ప్రయత్నించింది. అందులో భాగంగానే నూకరాజు మరియు ఆసియా లవ్ స్టోరీ అంటూ చాలా మంది నిన్న మొన్నటి వరకు అనుకుంటున్నారు.

కానీ వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకున్నారని వారి వారి సన్నిహితులు చెబుతున్నారు. ఇంట్లో వారికి కూడా ఇష్టమే అనేది తాజా టాక్. రెగ్యులర్ గా ఆసియా నూకరాజు ఫ్యామిలీ మెంబర్స్ తో కలవడం అలాగే ఆసియా కుటుంబ సభ్యులతో నూకరాజు కలవడం జరుగుతుంది. ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే కచ్చితంగా ఇద్దరు మధ్య రియల్ లవ్ ఉంది ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అనే నమ్మకంలో చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ కూడా యూట్యూబ్ లో రెగ్యులర్ గా వీడియోలు చేస్తూ అప్లోడ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. జబర్దస్త్ లో కలిసి కనిపించకున్నా వీరిద్దరి యొక్క జోడి శ్రీదేవి డ్రామా కంపెనీలో అప్పుడప్పుడు సందడి చేస్తుంది. ఇక యూట్యూబ్ ఓపెన్ చేస్తే వీరిద్దరి పేర్లలో ఏ ఒక్కరి పేరు మరొకరి పేరుతో కలిపి కొట్టిన బోలెడన్ని వీడియోస్ వస్తున్నాయి.

jabardasth nookaraju and Asiya love story interesting updates

jabardasth nookaraju and Asiya love story interesting updates

కనుక వీరిద్దరి మధ్య రిలేషన్ లేదు అంటే మాత్రం నమ్మడానికి లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రంగుల ప్రపంచంలో జనాలను ఆకట్టుకోవడానికి ఎన్నో మాయలు మర్మాలను చేస్తూ ఉంటారు. అలాగే వీళ్లు కూడా అదే దారిలో నడుస్తున్నారా లేదంటే వీరిద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉందా అనే తెలియాలి అంటే మరో రెండు మూడు సంవత్సరాలు వెయిట్ చేయాలి. నూకరాజు ఇప్పుడిప్పుడే జబర్దస్త్‌ నుండి బయటకు వస్తూ సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటున్నాడు. కనుక ఈ సమయంలో ప్రేమ పెళ్లి అనే కాన్సెప్ట్‌ మంచిది కాదేమో ఆలోచిస్తే బాగుంటుందని ఆయన అభిమానులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి