Rocking Rakesh – Jordar Sujatha : ఒకప్పుడుతో పోలిస్తే జబర్దస్త్ కార్యక్రమానికి ఇప్పుడు రేటింగ్ అత్యంత దారుణంగా పడిపోయింది. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ కార్యక్రమ నిర్వహకులు కాస్ట్ కట్టింగ్ పేరుతో చాలా మంది కమెడియన్స్ ని తొలగించారు. హైపర్ ఆది ఇప్పటికే జబర్దస్త్ నుండి తప్పుకోవడానికి కారణం కాస్ట్ కట్టింగ్ అనే ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. పలువురు కమెడియన్స్ రెమ్యూనరేషన్ తగ్గినా కూడా జబర్దస్త్ లోని కొనసాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారిలో రాకింగ్ రాకేష్ ఒకరు అంటూ ప్రచారం జరుగుతుంది.
ఇటీవల జోర్దార్ సుజాత ను వివాహం చేసుకున్న రాకేష్ చాలా కాలం గా జబర్దస్త్ లో సుజాత తో కలిసి కామెడీ స్కిట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ షో కారణంగా ఇద్దరికి కూడా మంచి పేరు మరియు బయట గుర్తింపు లభించింది. ఈ షో పేరు తో బయట మరికొన్ని షో లు మరియు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు వస్తున్నాయి. అందుకే ఇద్దరు కూడా చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుని జబర్దస్త్ షో లో కంటిన్యూ అవుతున్నారు అనే వార్తలు జోరుగా వస్తున్నాయి.
సాధారణంగా జబర్దస్త్ కమెడియన్స్ తీసుకునే రెమ్యూనరేషన్ కంటే వీరు చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ విషయంలో నిజం ఎంతో తెలియదు కానీ ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. జబర్దస్త్ లో చాలా మంది కూడా పారితోషికం అక్కర్లేదు కనిపిస్తే చాలు అన్నట్లుగా చేస్తున్నారు. బయట షో ల్లో మంచి రెమ్యూనరేషన్ వచ్చినా కూడా జబర్దస్త్ ను వదిలేసిన వారి పరిస్థితి ఏంటో ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. అందుకే చాలా మంది జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేందుకు సిద్దపడటం లేదు అనే టాక్ వినిపిస్తుంది.
Technician Vacancies : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మెదక్ (OFMK) జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్, అసిస్టెంట్ & జూనియర్ అసిస్టెంట్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తాయని అందరికీ తెలిసిందే. అంతేకాదు కొన్ని…
Donald Trump : ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలవడం మనం చూశాం. ట్రంప్ గెలుపుపై భారత…
Rahul Gandhi : జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గానీ, ఆయన…
Castes In Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లో కలిపి మొత్తం 243…
IAS Officers : పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం 13 మంది IAS అధికారులను బదిలీ చేసింది. ఉప…
Samantha : సమంత క్రేజ్ అప్పటికీ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. మయోసైటిస్ వలన కొన్నాళ్లు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన…
Janasena : మత్స్యకారుల ఉనికికి, ఉపాధికి విఘాతం కలిగించే జీవో నెం.217ను రద్దు చేయాలని గత ప్రభుత్వంని టీడీపీ నాయకులు,…
This website uses cookies.