Rocking Rakesh – Jordar Sujatha : జబర్దస్త్‌ రాకేష్‌, సుజాతలకు కలిపి కూడా మరీ అంత పారితోషికం ఇస్తారా..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rocking Rakesh – Jordar Sujatha : జబర్దస్త్‌ రాకేష్‌, సుజాతలకు కలిపి కూడా మరీ అంత పారితోషికం ఇస్తారా..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :10 March 2023,12:20 pm

Rocking Rakesh – Jordar Sujatha : ఒకప్పుడుతో పోలిస్తే జబర్దస్త్ కార్యక్రమానికి ఇప్పుడు రేటింగ్ అత్యంత దారుణంగా పడిపోయింది. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ కార్యక్రమ నిర్వహకులు కాస్ట్ కట్టింగ్ పేరుతో చాలా మంది కమెడియన్స్ ని తొలగించారు. హైపర్ ఆది ఇప్పటికే జబర్దస్త్ నుండి తప్పుకోవడానికి కారణం కాస్ట్ కట్టింగ్‌ అనే ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. పలువురు కమెడియన్స్ రెమ్యూనరేషన్ తగ్గినా కూడా జబర్దస్త్ లోని కొనసాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారిలో రాకింగ్ రాకేష్ ఒకరు అంటూ ప్రచారం జరుగుతుంది.

jabardasth comedians Rocking Rakesh and Jordar Sujatha remuneration

jabardasth comedians Rocking Rakesh and Jordar Sujatha remuneration

ఇటీవల జోర్దార్ సుజాత ను వివాహం చేసుకున్న రాకేష్ చాలా కాలం గా జబర్దస్త్ లో సుజాత తో కలిసి కామెడీ స్కిట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. జబర్దస్త్‌ షో కారణంగా ఇద్దరికి కూడా మంచి పేరు మరియు బయట గుర్తింపు లభించింది. ఈ షో పేరు తో బయట మరికొన్ని షో లు మరియు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు వస్తున్నాయి. అందుకే ఇద్దరు కూడా చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుని జబర్దస్త్‌ షో లో కంటిన్యూ అవుతున్నారు అనే వార్తలు జోరుగా వస్తున్నాయి.

jabardasth comedians Rocking Rakesh and Jordar Sujatha remuneration

jabardasth comedians Rocking Rakesh and Jordar Sujatha remuneration

సాధారణంగా జబర్దస్త్ కమెడియన్స్ తీసుకునే రెమ్యూనరేషన్ కంటే వీరు చాలా తక్కువ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ విషయంలో నిజం ఎంతో తెలియదు కానీ ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. జబర్దస్త్‌ లో చాలా మంది కూడా పారితోషికం అక్కర్లేదు కనిపిస్తే చాలు అన్నట్లుగా చేస్తున్నారు. బయట షో ల్లో మంచి రెమ్యూనరేషన్‌ వచ్చినా కూడా జబర్దస్త్‌ ను వదిలేసిన వారి పరిస్థితి ఏంటో ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. అందుకే చాలా మంది జబర్దస్త్‌ కార్యక్రమాన్ని వదిలేందుకు సిద్దపడటం లేదు అనే టాక్‌ వినిపిస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది