Jabardasth : జబర్దస్త్‌ దుఖాణం క్లోజ్ వార్తలపై మల్లెమాల రియాక్షన్‌

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: June 14, 2022, 1:00 pm

తెలుగు బుల్లి తెర పై కామెడీ షో అనగానే గుర్తుకు వచ్చే జబర్దస్త్‌ టైమ్‌ సరిగా లేదు. గత కొన్ని వారాలుగా షో ను జనాల పట్టించుకుంటున్న దాఖలాలు కూడా లేవు అంటూ టాక్ వినిపిస్తుంది. ఈ సమయంలో జబర్దస్త్‌ కామెడీ షో ను క్లోజ్‌ చేయబోతున్నారని… ఇక నుండి శ్రీదేవి డ్రామా కంపెనీ మాత్రమే ఉండబోతుంది అంటూ కొందరు సోషల్‌ మీడియాలో చేస్తున్న ప్రచారం తో జబర్దస్త్‌ అభిమానులు షాక్ అవుతున్నారు. భారీ ఎత్తున రేటింగ్ ను దక్కించుకుని గతంలో ఇండియాస్ టాప్ రేటెడ్‌ షో గా జబర్దస్త్‌ నిలిచింది.

అద్బుతమైన జబర్దస్త్‌ కార్యక్రమంను ఈమద్య కాలంలో మల్లెమాల వారు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వదిలేశారు అంటూ విమర్శలు వస్తున్నాయి. దాంతో కమెడియన్స్ పలువురు షో కు దూరం అయ్యారు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌.. ఆది మరియు గెటప్ శ్రీనులు షో కు దూరం అయ్యారు. అనసూయ కూడా జబర్దస్త్‌ కు దూరం అయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో మల్లెమాల టీమ్‌ వారు స్పందించారు. జబర్దస్త్‌ కార్యక్రమంకు ఇప్పటికి కూడా టాప్ రేటింగ్‌ వస్తుంది. షో లో ఎవరు ఉన్నా లేకున్నా కూడా ఎలాంటి మార్పు రాదు.

Jabardasth comedy show mallemala tv clarity about rating

Jabardasth comedy show mallemala tv clarity about rating

ఎవరు పోయినా కొత్త వారు వస్తూనే ఉంటారు. కొత్త వారితో షో ఖచ్చితంగా ముందు మాదిరిగానే మంచి రేటింగ్ ను దక్కించుకుంటుంది అంటూ ఈ సందర్బంగా మల్లెమాల వారు చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్క షో కు కూడా అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ జబర్దస్త్‌ కూడా ఖచ్చితంగా మంచి రేటింగ్ ను దక్కించుకుని మళ్లీ నెం.1 గా నిలవడం ఖాయం అని.. ఇప్పటికి కూడా మరే ఛానల్ యొక్క షో లు సక్సెస్ అవ్వడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp