Home » Entertainment » Jabardasth Comedy Show Saddam Team Want To Quit Very Soon
Entertainment

Saddam Team : బాబోయ్ మా వల్ల కాదు.. జబర్దస్త్‌ మానేస్తాం అంటూ సద్దాం టీం ప్రకటన

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: March 10, 2023 8:38 pm
Advertisement

Saddam Team : ఈ మధ్య కాలంలో జబర్దస్త్ టైం అస్సలు బాగున్నట్లుగా లేదు. రేటింగ్ సరిగా రాక పోవడంతో పాటు కమెడియన్స్ విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. కాస్త బాగా చేస్తున్నారు అనుకుంటున్నా సమయంలో కమెడియన్స్ వెళ్ళి పోతున్నారు. హైపర్ ఆది సుడిగాలి సుదీర్ వెళ్లి పోయిన తర్వాత ఎంతో మంది కమెడియన్స్ వస్తున్నారు కానీ ఆ స్థాయిలో సక్సెస్ సొంతం చేసుకోలేక పోతున్నారని చెప్పాలి. అయితే పటాస్ టీం సద్దాం, యాదమ రాజు జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత కాస్త సందడి కనిపిస్తుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

jabardasth comedy show Saddam Team want to quit very soon

అలాంటి సద్దాం టీం ని కొందరు కావాలని టార్గెట్ చేసి పదే పదే విమర్శలు చేయడంతో పాటు మల్లెమాలకు చెందిన వారు కూడా ఆ టీం పట్ల చిన్న చూపు చూస్తున్నారట. దాంతో సద్దాం మరియు ఆయన టీం మల్లెమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జబర్దస్త్ కార్యక్రమం ఇప్పటికే నడ్డి విరిగిన నక్క అన్నట్లుగా ముందు సాగుతోంది. రేటింగ్ లేక కామెడీ లేక ప్రేక్షకుల ఆదరణ లేక ముందుకు సాగుతున్న జబర్దస్త్ కార్యక్రమం కి సద్దాం టీం కూడా గుడ్ బై చెప్తే కచ్చితంగా డామేజ్ పెద్దగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

కనుక మల్లెమాల వారు ఆ టీం తో జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని ప్రేక్షకుల మరియు జబర్దస్త్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, సద్దాం టీం గతంలో వేరే ఛానల్స్ లో చేసి వచ్చిన విషయం తెల్సిందే. అందుకే జబర్దస్త్‌ లో ఉన్న ఓల్డ్‌ కమెడియన్స్ తో కాస్త ర్యాగింగ్ ఎదుర్కొంటున్నారట. సీనియర్ కమెడియన్స్ తో పోల్చితే వారికి ప్రాముఖ్యత తక్కువ ఇవ్వడంతో పాటు అన్ని విషయాల్లో కూడా వారిని చిన్న చూపు చూస్తున్నారట. ఇప్పటికే ఎంతో మంది మంచి కమెడియన్స్ ని పోగొట్టుకున్న జబర్దస్త్ కార్యక్రమం ఇక నుండి అయినా ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటుందని ఆశిద్దాం.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి