Home » Entertainment » Jabardasth Emmanuel Satires On Nookaraju In Jathi Ratnalu Latest Week Promo
Entertainment

Jabardasth Emmanuel : నూకరాజు ఇజ్జత్ తీసేశారు.. ఆ విషయంలో ఇమాన్యుయేల్ తగ్గడం లేదుగా

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: May 24, 2022 10:25 am
Advertisement

Jabardasth Emmanuel : బుల్లితెరపై కామెడీ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఒకరిపై సెటైరికల్ కామెంట్లు వేస్తేనే మిగతా వాళ్లు నవ్వుతారు అని అనుకుంటుంటారు. అందుకే ఓ ఆర్టిస్ట్ మీద మిగతా అందరూ కలిసి కౌంటర్లు వేస్తుంటారు. అదే జోకులు అనుకుని అందరూ నవ్వుకుంటుంటారు. అయితే తాజాగా జాతి రత్నాలు షోకు సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇందులో నూకరాజును ఆడేసుకున్నారు అంతా.నూకరాజుకు విషయం లేదన్నట్టుగా కౌంటర్లు వేశారు. ఒక్కరూ కాదు..

Advertisement

ఇద్దరుముగ్గురూ అదే విషయం మీద కామెంట్లు చేశారు. నూకరాజుకు విషయం లేదంట అని స్కిట్లు వేశారు. వచ్చిన కంటెస్టెంట్లు కూడా అదే కామెంట్లు చేశారు. నూకరాజుకు ఏం లేదంట అని నానా హంగామా చేశారు. అయితే వాళ్లు ఎంతగా కామెంట్లుచేసినా నూకరాజు మాత్రం ఎంతో స్పోర్టీవ్‌గా తీసుకున్నాడు.ఇమాన్యుయేల్ అన్నాడంటే అది వారిద్దరి మధ్య ర్యాపో అని అనుకోవచ్చు. కానీ స్టాండప్ కమెడియన్లు కూడా నూకరాజు పరువుతీసేశారు.

Jabardasth Emmanuel Satires On Nookaraju in Jathi Ratnalu Latest Week Promo

Advertisement

నూకరాజుకు విషయం లేదంటా అని ఇమాన్యుయేల్ అంటే.. ఇంకో అమ్మాయి కూడా అవును కదా లేదంట అని అనేస్తుంది. మరొకతను వచ్చి.. నూకరాజుకు విషయం లేదంట అనే టాపిక్ మీద కౌంటర్లు వేస్తాడు. నూకరాజుకు ఏం లేదు కాబట్టే ఇంత క్రేజ్ అని అంటాడు.దీంతో ఇమాన్యుయేల్ కాస్త హర్ట్ అయినట్టున్నాడు.తిరిగి పంచ్ వేశాడు. నీక్కూడా లేదు కదా? అందుకే క్రేజ్ అని ఇమాన్యుయేల్ అంటాడు. నాకు ఉంది కావాలంటే చూపిస్తాను అని ఇమాన్యుయేల్‌కు కౌంటర్ వేస్తాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి