Sudigali Sudheer : ఛీ..ఛీ.. పది సంవత్సరాలుగా బుల్లి తెర ప్రేక్షకులను పిచ్చి వాళ్లను చేసిన సుడిగాలి సుధీర్‌..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :10 February 2023,9:00 pm

Sudigali Sudheer : ఒకటి కాదు.. రెండు కాదు పది సంవత్సరాలుగా బుల్లి తెర ప్రేక్షకులను జబర్దస్త్ మాజీ కమెడియన్ టీం లీడర్ సుడిగాలి సుధీర్ మోసం చేస్తూ వస్తున్నాడు. 2014 సంవత్సరంలోనే సుధీర్ కి పెళ్లి అయిందని ప్రచారం జరుగుతోంది. అయినా కూడా ఇప్పటి వరకు పెళ్లి కాలేదని చెబుతూ వస్తున్నాడు. జబర్దస్త్ చేస్తున్నప్పుడు రష్మీ గౌతమ్ తో ప్రేమలో ఉన్నాడని ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం జరిగింది. ఇప్పటికీ కూడా సుధీర్‌ అభిమానులు చాలా మంది రష్మి గౌతమ్ ని ఆయన పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు.

jabardasth ex team leader Sudigali Sudheer already married

jabardasth ex team leader Sudigali Sudheer already married

చాలా మందికి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారని తెలుసు. అసలు విషయం ఏంటంటే 2014 సంవత్సరంలోనే సుధీర్ వివాహం అయింది. ఆ పెళ్లి కి జబర్దస్త్ మాజీ టీం లీడర్ ధనరాజ్ తో పాటు ప్రస్తుత టీం లీడర్ రాకింగ్ రాకేష్ కూడా హాజరయ్యాడు. రాకింగ్ రాకేష్ అప్పట్లో తన ఫేస్‌ బుక్ లో తాను సుధీర్ పెళ్లి కి వెళ్లాను అంటూ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ విషయంలో సుధీర్ ఏమంటాడు అనేది చూడాలి. నిజంగానే సుధీర్ పెళ్లి అయిందా,

jabardasth ex team leader Sudigali Sudheer already married

jabardasth ex team leader Sudigali Sudheer already married

ఒకవేళ పెళ్లయితే ఎన్ని రోజులు దాచడానికి కారణం ఏంటి, అసలు ఇన్నాళ్లు ఎలా సుధీర్ వివాహం గురించి దాచారు అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ పెళ్లి అయితే ఆమె నుండి సుధీర్ విడాకులు తీసుకున్నాడా అని కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే సుధీర్ నోరు విప్పాల్సిందే. ఇక సుధీర్ కెరీయర్ గురించి మాట్లాడుకుంటే చాలా కాలంగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. సినిమాల్లో హీరోగా నటిస్తున్న కారణంగా జబర్దస్త్‌ కార్యక్రమంకు దూరం అయ్యాడు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి