Jabardasth Faima : ఏం చేయలేడు!.. బుల్లెట్ భాస్కర్‌పై ఫైమా దారుణ కామెంట్లు

Authored By Cinema Desk | The Telugu News | Published on: November 17, 2021, 7:15 am

Jabardasth Faima : బుల్లెట్ భాస్కర్, ఫైమా ఈ మధ్యన ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో కుమ్మేస్తున్నారు. రెచ్చిపోదాం బ్రదర్ షోలోనూ కామెడీతో నవ్విస్తున్నారు. అయితే ఫైమా ఇమిటేషన్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. తాజాగా వదిలిన ప్రోమోలో ఫైమా అందరినీ ఆకట్టుకుంటుంది. బుల్లెట్ భాస్కర్‌ మీద దారుణమైన కామెంట్లు చేసింది. బుల్లెట్ భాస్కర్, ఫైమా, వర్ష, ఇమాన్యుయేల్ కలిసి ఓ స్కిట్ వేశారు. వర్ష హీరోయిన్ల నటించింది. ఆమెకు భర్త, అసిస్టెంట్‌గా ఇమాన్యుయేల్ నటించాడు.

ఇక సినిమా తీయడం, సినిమా సెట్ల మీద జరిగే ఫన్‌తో స్కిట్లు రాసుకోవడం బుల్లెట్ భాస్కర్‌కు అలవాటే. ఈ సారి బుల్లెట్ భాస్కర్ హీరోగా వచ్చాడు. మామూలుగా అయితే బుల్లెట్ భాస్కర్ దర్శకుడిగా నటిస్తాడు. హీరో హీరోయిన్లుగా మిగతా వాళ్లను పెట్టుకుంటాడు. ఈ సారి మాత్రం బుల్లెట్ భాస్కర్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక హీరోయిన్‌‌గా వర్ష ఎంట్రీ ఇస్తుంది. అలా నీతో కొంచెం డిస్కషన్ చేయాలి పదా? అంటూ వర్షను కేరవాన్ లోపలకి తీసుకెళ్తాడు బుల్లెట్ భాస్కర్.

Jabardasth Faima On Bullet Bhaskar In Extra Jabardasth

Jabardasth Faima On Bullet Bhaskar In Extra Jabardasth

Jabardasth Faima : బుల్లెట్ భాస్కర్‌పై ఫైమా

అలా పక్కకి వెళ్లడంతో ఇమాన్యుయేల్ తెగ కంగారు పడుతుంటాడు. ఏమైంది అని ఫైమా అంటే.. వెళ్లింది నీ పెళ్లాం కాదు.నా పెళ్లాం అని అంటాడు. వెళ్లింది అక్కడ నా మొగుడు ఏం చేయడు అని తేడాగా కామెంట్ చేస్తుంది.అలా అనడంలోనూ వింతగా వెక్కిరిస్తుంది. వెంటనే ఫైమా వెక్కిరింతను కూడా రష్మీ, రోజా అనుకరిస్తారు. అలా మొత్తానికి బుల్లెట్ భాస్కర్, ఫైమా ఇప్పుడు మంచి టైమింగ్‌తో దూసుకుపోతోన్నారు. ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో వీరు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంటున్నారు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp