Jabardasth Faima : ఇమాన్యుయేల్‌కు చుక్కలే.. లాగి పెట్టి కొట్టేసిన ఫైమా
Jabardasth Faima : బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంతలా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. జబర్దస్త్ షోలో ఇప్పుడు కమెడియన్లు ఫుల్ ట్రెండ్ అవుతున్నారు. వర్ష, ఇమాన్యుయేల్, ఫైమా ఈ మధ్య ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా ఫైమా అయితే అందరినీ దడదడలాడిస్తోంది. తాజాగా వదిలిన ప్రోమోలో ఇమాన్యుయేల్‌ను ఫైమా ఆడుకుంది.
ఫైమా మామూలుగానే ఈ మధ్య రెచ్చిపోతోంది. కామెంట్లు, సెటైర్లతో ఆడుకుంటోంది. బుల్లెట్ భాస్కర్, ఇమాన్యుయేల్‌లను సెటైర్లతో దాడి చేస్తుంటుంది. ఇక మధ్య మధ్యలో అయితే చేయి కూడా చేసుకుంటుంది. తాజాగా వదిలిన ప్రోమోలో ఇమాన్యుయేల్‌ను లాగి పెట్టి కొట్టేసింది. దీంతో ఇమాన్యుయల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

Jabardasth Faima Slap On Emmanuel In Extra Jabardasth
Jabardasth Faima : ఇమాన్యుయేల్‌ను కొట్టిన ఫైమా
ఇక ఫైమాను కొట్టేందుకు ఆమె వెంట పడ్డాడు. కానీ ఆమె స్టేజ్ దిగి అలా పారిపోయింది. మొత్తానికి ఫైమా ఇప్పుడు జబర్దస్త్ షోలో మోస్ట్ వాంటెడ్ లేడీ కమెడియన్‌గా ఎదిగింది. ఫైమా లవ్ స్టోరీ అందరికీ తెలిసిందే. పటాస్ ప్రవీణ్‌తో ఫైమా లవ్ స్టోరీ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి వేసే స్కిట్లు కూడా వైరల్ అవుతుంటుంది. శ్రీదేవీ డ్రామా కంపెనీలోనూ ఈ ఇద్దరూ సందడి చేస్తుంటారు.
