Sudigali Sudheer – Getup Srinu : గెటప్ శ్రీను – సుడిగాలి సుధీర్ విడిపోవడం వెనక ఉన్నది ఆ అమ్మాయే ?
Sudigali Sudheer – Getup Srinu : బుల్లితెర మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ షో ద్వారా గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ ఫుల్ పాపులర్ అయ్యారు. తమ పంచులతో, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఎంతో కష్టపడినా ఈ కమెడియన్స్ జబర్దస్త్ షో తో ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే జబర్దస్త్ లో మంచి స్నేహితులు రాంప్రసాద్, గెటప్ శ్రీను, సుడిగాలి సుదీర్ అని చెప్పవచ్చు. జబర్దస్త్ స్టార్టింగ్ నుంచి ఈ ముగ్గురు కలిసి స్కిట్స్ వేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం స్కిట్స్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు.
ఫ్యామిలీ ఫంక్షన్స్ అయిన, ఈవెంట్స్ అయినా ముగ్గురు కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎంతో క్లోజ్ గా ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ విడిపోయారు అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం గెటప్ శ్రీను, రాంప్రసాద్, సుడిగాలి సుదీర్ విడిపోయారని సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. పరిస్థితులను చూస్తే అవే నిజమని గెటప్ శ్రీను , సుడిగాలి సుదీర్ దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం ఓ అమ్మాయి అని అంటున్నారు.
రాంప్రసాద్ కు హెల్త్ బాగో లేనప్పుడు గెటప్ శ్రీను, సుడిగాలి సుదీర్ ఆయనకు డబ్బు పరంగా సహాయం చేశారు. అయితే ఆ డబ్బులు ఓ అమ్మాయి దగ్గరనుంచి తీసుకున్నారని, అప్పు తిరిగి ఇవ్వాల్సిన టైం లో గెటప్ శ్రీను, సుడిగాలి సుదీర్ మధ్య గొడవలు మొదలయ్యాయి అని ఆ కారణంగా వీళ్ళు దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది. జబర్దస్త్ లో ఉండే అమ్మాయి ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ని ఒకే ఒక్క కారణంతో విడగొట్టిందని జనాలు అనుకుంటున్నారు. అంతేకాదు వీరు మళ్ళీ కలిస్తే చూడాలని ఉందని అభిమానులు భావిస్తున్నారు.