Jabardasth Naresh : శ్రుతి మించిపోతున్న చేష్టలు.. షబీనాతో రెచ్చిపోయిన జబర్దస్త్ నరేష్..
Jabardasth Naresh : పలు సీరియల్స్‌లో నటించిన షబీనాకు.. జబర్దస్త్ తర్వాత భారీగా క్రేజ్ వచ్చింది. కెవ్వు కార్తీక్ స్కిట్‌లో ఆమె సందడి చేస్తుంది. షబీనా అందం కార్తీక్ స్కిట్‌కు చాలా ప్లస్ అవుతుంది. ఆమె కేంద్రంగానే కొన్ని స్కిట్స్ కూడా రాస్తున్నారు. దీంతో ఇంకేముంది గత కొద్ది వారాలుగా..ప్రతి ఏపిసోడ్‌లోనూ షబీనా సందడి చేస్తుంది. అయితే స్కిట్స్ కొద్దిగా శృతిమించితున్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ నరేష్.. ఓవర్ యాక్షన్ ఎక్కువపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. షబీనాను టచ్ చేయడాని తెగ ఆరాటపడుతున్నట్టుగా కనిపిస్తోంది.

Jabardasth Naresh once again over action With Shabina
గత వారమే స్కిట్‌లో ఉన్నదాని కన్నా నరేష్ ఎక్కువగా చేశాడని.. ఒక సారి ముట్టుకోవాలని ఉంటే నరేష్ మూడు సార్లు చేశాడని షబీనా రోజాకు చెప్పింది. రోజా కూడా ఏరా నరేష్ అంటూ ఫన్నీ కౌంటర్ ఇచ్చింది. అయితే నరేష్ తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. తాజా స్కిట్‌లో కూడా నరేష్ ఇలాంటి చర్యలకే పాల్పడ్డాడు. మరోసారి షబీనా బుగ్గలు టచ్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు.
Jabardasth Naresh : రెచ్చిపోయిన నరేష్..

Jabardasth Naresh once again over action With Shabina
తాజాగా విడుదలైన ఎక్స్‌ట్రా జబర్దస్ ప్రోమోలో.. షబీనా చందమామగా కనిపించగా.. నరేష్ చందమామతో ఉండి ఎన్ని రోజులైందో.. చందమామ.. చందమామ.. అంటూ షబీనా బుగ్గలను గిల్లుతాడు. అయితే అది కాస్తా మరి ఎక్కువ కావడంతో.. కార్తీక్ నరేష్‌ను అక్కడి నుంచి పక్కకు జరుపుతాడు. అయితే నరేష్.. చిన్న పిల్లోడని(వయసు పెద్దదే) ఏది చేసిన ఫన్నీగా ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నట్టుగా ఉన్నారు. అయితే ఏదైనా పరిధి దాటితే చూడటానికి బాగోదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
