Home » Entertainment » Jabardasth Naresh Satires On Anchor Rashmi Gautam
Entertainment

Jabardasth Naresh : మిమ్మల్ని బండ బూతులు తిట్టాలి.. యాంకర్ రష్మీ పరువుతీసిన నరేష్

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: December 14, 2021 10:20 am
Advertisement

Jabardasth Naresh  : బుల్లితెరపై ట్రాకులు మొదలుపెట్టిందే రష్మీ సుధీర్. గత ఎనిమిది తొమ్మిదేళ్లుగా రష్మీ సుధీర్ జోడి చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇద్దరి మధ్య ఏమీ లేకపోయినా కూడా ఆన్ స్క్రీన్ మాత్రం మామూలుగా రొమాన్స్ పండించరు. చూపులతోనే ఈ ఇద్దరూ కెమిస్ట్రీని పీక్స్‌కు తీసుకెళ్తుంటారు. అయితే తాజాగా రష్మీ వేసిన స్కిట్‌లో అందరూ కలిసి ఆమె మీద సెటైర్లు వేశారు.

Advertisement

తాజాగా వదిలిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో రష్మీ స్పెషల్ స్కిట్ చేసినట్టుంది. రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్, నరేష్, ఇమాన్యుయేల్, వర్ష ఇలా అందరినీ కట్టేసి ఉంచింది. ఒక్కొక్కరిని రష్మీ రోస్ట్ చేయాలని చూస్తే.. తిరిగి ఆమెనే ట్రోల్ చేసేశారు. ఎక్స్ ట్రా జబర్దస్త్‌ షోకు అన్యాయం చేశారు అందుకే ఇలా కట్టేశా అని రష్మీ అంటే.. అయితే ముందుగా నిన్నే కట్టేయాలని రాం ప్రసాద్ కౌంటర్ వేస్తాడు.

jabardasth naresh satires on anchor rashmi gautam

Advertisement

Jabardasth Naresh  : స్కిట్‌లో రష్మీ రచ్చ..

ఇక నరేష్ మీద రష్మీ పంచ్‌లు వేయాలని చూస్తుంటే.. స్కిట్ వేయమంటే.. షబీనాతో లవ్ సింబల్స్ వేసుకోవాలని చూస్తున్నావా? అని రష్మీ ప్రశ్నిస్తుంది. ఇదంతా స్టార్ట్ చేసింది ఎవరు? అని నరేష్ అడుగుతాడు. ఎవరు అని రష్మీ అంటే.. చిన్న పిల్లాడికి కూడా ఇదంతా స్టార్ట్ చేసింది మీరే అని.. మిమ్మల్ని బూతులు తిట్టాలి.. బండ బూతులు తిట్టాలని అనడంతే రష్మీ షాక్ అవుతుంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి