Jabardasth New Anchor Sowmya Rao quit the show soon
Anchor Sowmya Rao : ఈ మధ్య కాలంలో జబర్దస్త్ గురించి పదే పదే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ కార్యక్రమం రేటింగ్ తగ్గిందని, గతంతో పోలిస్తే దారుణమైన రేటింగ్ నమోదవుతుందని అందరికీ తెలిసిందే. కమెడియన్ లు ఒకరి వెనక ఒకరు వెళ్లి పోతున్నారు. జడ్జ్ ల్లో కొందరు విభేదాల కారణంగా వెళితే, మరి కొందరు మరి కొన్ని కారణాల వల్ల వెళుతున్నారు. ఇక యాంకర్స్ కూడా మారుతూనే ఉన్నారు. అనసూయ జబర్దస్త్ కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు యాంకర్ గా వ్యవహరించింది. అప్పటి నుండి మధ్యలో చిన్న గ్యాప్ తీసుకొని మొన్నటి వరకు యాంకర్ గా వ్యవహరించింది.
Jabardasth New Anchor Sowmya Rao quit the show soon
ఆమె తప్పుకోవడంతో ఆ స్థానంలో కన్నడ బ్యూటీ సౌమ్యా రావు ఎంట్రీ ఇచ్చింది. వచ్చి రాని తెలుగుతో సౌమ్య జబర్దస్త్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. అనసూయ మరియు రష్మీ గౌతమ్ లకు ఏమాత్రం తక్కువ కాకుండా అందాల ఆరబోత చేస్తూ కార్యక్రమాన్ని తనదైన శైలిలో నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లింది. ఇప్పటికి కూడా ఆమె షో లో కనిపిస్తూనే ఉంది. ఈ సమయంలో ఆమె గురించి రకరకాలుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సౌమ్య కి పెళ్లి అయిందా లేదా అనే విషయంపై
Jabardasth New Anchor Sowmya Rao quit the show soon
చాలా మందికి క్లారిటీ లేదు, ఆ విషయాన్ని ఆమె కూడా ఎప్పుడు అధికారికంగా వెల్లడించలేదు. ఈ సమయంలో సౌమ్య తల్లి కాబోతుంది అనే పుకార్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి. గతంలో అనసూయ ఎలాగైతే గర్భవతి అవ్వడంతో జబర్దస్త్ కార్యక్రమానికి కాస్త గ్యాప్ ఇచ్చిందో ఇప్పుడు అలాగే సౌమ్య జబర్దస్త్ కి చిన్న గ్యాప్ ఇవ్వబోతుందని ఈ గ్యాప్ లో రష్మీ గౌతమ్ రెండు కార్యక్రమాలకు కూడా యాంకరింగ్ చేయబోతుందని సమాచారం ప్రచారం జరుగుతుంది. అసలు విషయం ఏంటి అనేది ఆ మల్లెమాల వారికే తెలియాలి.
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
This website uses cookies.