Anchor Sowmya Rao : జబర్దస్త్‌ యాంకర్‌ సౌమ్య గురించి షాకింగ్ పుకారు.. షో మానేస్తుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anchor Sowmya Rao : జబర్దస్త్‌ యాంకర్‌ సౌమ్య గురించి షాకింగ్ పుకారు.. షో మానేస్తుందా?

Anchor Sowmya Rao : ఈ మధ్య కాలంలో జబర్దస్త్ గురించి పదే పదే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ కార్యక్రమం రేటింగ్ తగ్గిందని, గతంతో పోలిస్తే దారుణమైన రేటింగ్ నమోదవుతుందని అందరికీ తెలిసిందే. కమెడియన్ లు ఒకరి వెనక ఒకరు వెళ్లి పోతున్నారు. జడ్జ్ ల్లో కొందరు విభేదాల కారణంగా వెళితే, మరి కొందరు మరి కొన్ని కారణాల వల్ల వెళుతున్నారు. ఇక యాంకర్స్ కూడా మారుతూనే ఉన్నారు. అనసూయ జబర్దస్త్ కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :7 February 2023,12:00 pm

Anchor Sowmya Rao : ఈ మధ్య కాలంలో జబర్దస్త్ గురించి పదే పదే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ కార్యక్రమం రేటింగ్ తగ్గిందని, గతంతో పోలిస్తే దారుణమైన రేటింగ్ నమోదవుతుందని అందరికీ తెలిసిందే. కమెడియన్ లు ఒకరి వెనక ఒకరు వెళ్లి పోతున్నారు. జడ్జ్ ల్లో కొందరు విభేదాల కారణంగా వెళితే, మరి కొందరు మరి కొన్ని కారణాల వల్ల వెళుతున్నారు. ఇక యాంకర్స్ కూడా మారుతూనే ఉన్నారు. అనసూయ జబర్దస్త్ కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు యాంకర్ గా వ్యవహరించింది. అప్పటి నుండి మధ్యలో చిన్న గ్యాప్ తీసుకొని మొన్నటి వరకు యాంకర్ గా వ్యవహరించింది.

Jabardasth New Anchor Sowmya Rao quit the show soon

Jabardasth New Anchor Sowmya Rao quit the show soon

ఆమె తప్పుకోవడంతో ఆ స్థానంలో కన్నడ బ్యూటీ సౌమ్యా రావు ఎంట్రీ ఇచ్చింది. వచ్చి రాని తెలుగుతో సౌమ్య జబర్దస్త్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. అనసూయ మరియు రష్మీ గౌతమ్ లకు ఏమాత్రం తక్కువ కాకుండా అందాల ఆరబోత చేస్తూ కార్యక్రమాన్ని తనదైన శైలిలో నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లింది. ఇప్పటికి కూడా ఆమె షో లో కనిపిస్తూనే ఉంది. ఈ సమయంలో ఆమె గురించి రకరకాలుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సౌమ్య కి పెళ్లి అయిందా లేదా అనే విషయంపై

Jabardasth New Anchor Sowmya Rao quit the show soon

Jabardasth New Anchor Sowmya Rao quit the show soon

చాలా మందికి క్లారిటీ లేదు, ఆ విషయాన్ని ఆమె కూడా ఎప్పుడు అధికారికంగా వెల్లడించలేదు. ఈ సమయంలో సౌమ్య తల్లి కాబోతుంది అనే పుకార్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి. గతంలో అనసూయ ఎలాగైతే గర్భవతి అవ్వడంతో జబర్దస్త్ కార్యక్రమానికి కాస్త గ్యాప్ ఇచ్చిందో ఇప్పుడు అలాగే సౌమ్య జబర్దస్త్ కి చిన్న గ్యాప్ ఇవ్వబోతుందని ఈ గ్యాప్ లో రష్మీ గౌతమ్ రెండు కార్యక్రమాలకు కూడా యాంకరింగ్ చేయబోతుందని సమాచారం ప్రచారం జరుగుతుంది. అసలు విషయం ఏంటి అనేది ఆ మల్లెమాల వారికే తెలియాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది