Jabardasth remuneration for team leader Rowdy Rohini
Jabardasth Rohini : బుల్లి తెర సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రోహిణి ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం తో పాటు ఇతర చానల్స్ లో పలు కార్యక్రమాల్లో కనిపిస్తూ సందడి చేస్తోంది. జబర్దస్త్ లో మొదటి లేడీ టీమ్ లీడర్ గా రోహిణి గుర్తింపు దక్కించుకుంది. ఆమె టీం లీడర్ గా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నా కూడా మల్లెమాల వారు ఛాన్స్ ల మీద చాన్స్ లు ఇస్తూనే ఉన్నారు. ఆమె కు వచ్చిన ఆఫర్స్ ఇతర ఛానల్స్ లో సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. సాధారణంగా జబర్దస్త్ టీం లీడర్స్ మరే ఛానల్ లో కూడా కనిపించరు.. కానీ రోహిణికి మాత్రం ఆ వెసులుబాటును మల్లెమాల వారు ఇచ్చారు. రౌడీ రోహిణి టీం లీడర్ గా సక్సెస్ అయినా కాకున్నా మల్లెమాల వారు కొనసాగిస్తూ ఉండటంతో పాటు, వేరే ఛానల్స్ లో కూడా ఆమెకు చేసుకునే అవకాశం కలిగించడం నిజంగా అరుదైన విషయంగా బుల్లి తెర వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉంటున్నారు. తాజాగా ఈమె జీ తెలుగు లో ఒక డాన్స్ కార్యక్రమంలో సందడి చేస్తోంది.
అంతే కాకుండా స్టార్ మా లో కూడా రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంటుంది. అక్కడ ఇక్కడ అన్నిచోట్ల కనిపిస్తూ ఉన్న రోహిణికి మల్లెమాల వారు జబర్దస్త్ గాను ఎంత పారితోషికం ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. జబర్దస్త్ టీం లీడర్స్ మరియు కంటెస్టెంట్స్ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోరు అనేది చాలా మంది వాదన. వారికి రెమ్యూనరేషన్ కంటే జబర్దస్త్ ద్వారా వచ్చే గుర్తింపు ముఖ్యం. చాలా మంది రెమ్యూనరేషన్ లేకుండానే కనిపించాలని ఆశపడుతూ ఉంటారు. రౌడీ రోహిణి కూడా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అయితే తీసుకోవడం లేదు.. కానీ ఒక మోస్తారు రెమ్యూనరేషన్ ను మాత్రమే తీసుకుంటుందని సమాచారం అందుతుంది. ఇతర చానల్స్ లో ఆమె తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తో పోలిస్తే మల్లెమాల వారు జబర్దస్త్ కి గాను ఆమెకు ఇచ్చే రెమ్యూనరేషన్ చాలా చాలా తక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఆమె రెమ్యూనరేషన్ ఏమీ తీసుకోకుండా తన టీమ్ మెంబర్స్ కి రెమ్యూనరేషన్ పంచుతుందట.
Jabardasth remuneration for team leader Rowdy Rohini
రౌడీ రోహిణిగా ఆమెకు మంచి పాపులారిటీ అయితే లభిస్తుంది కనుక రెమ్యూనరేషన్ విషయం లో పెద్దగా పట్టింపు లేదని ఆమె సన్నిహితులు అంటూ ఉంటారు. ఆమెకు కావాల్సిన మొత్తం మరో మార్గం లో ఇతర చానల్స్ ద్వారా వస్తుందని జబర్దస్త్ లో చేస్తున్నామని సంతృప్తి కోసమే ఆమె తక్కువ రెమ్యూనరేషన్ అయిన చేస్తుందంటూ సన్నిహితులు చెబుతున్నారు. ఇతర టీం లీడర్స్ తో పోలిస్తే రోహిణి పారితోషికం చాలా చాలా తక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున రోహిణి గురించి ప్రచారం జరుగుతుంది. ఆమె రెమ్యూనరేషన్ గురించి మరియు ఆమె కామెడీ గురించి ప్రముఖంగా చర్చించుకుంటున్నారు. జబర్దస్త్ లోని వారు కూడా చాలా మంది రోహిణి పారితోషికం విని ముక్కున వేలేసుకుంటున్నారంట.. అంత తక్కువగా ఆమె రెమ్యూనరేషన్ తీసుకుంటుందని ప్రేక్షకులు కూడా ఆమె రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అంటూ జబర్దస్త్ వారు గుసగుసలాడుకుంటున్నారు.
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
This website uses cookies.